కేంద్రం జారీ చేసిన షోకాజ్ నోటీసులకు బంగాల్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఆలాపన్ బంధోపాధ్యాయ్ వివరణ ఇచ్చారు. తుపాను నేపథ్యంలో మే 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి అలాపన్ గైర్హాజరీపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఆయనకు కేంద్రం ఈ నోటీసులు జారీ చేసింది. అయితే.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచనల మేరకు తాను 'యాస్' తుపాను ప్రభావిత ప్రాంతమైన తూర్పు మెదినీపుర్ జిల్లాలోని దిఘాకు వెళ్లానని కేంద్రానికి ఆలాపన్ సమాధానమిచ్చారు. మే 31న ఆయనకు కేంద్ర హోం శాఖ ఈ నోటీసులు జారీ చేసింది.
ఆలాపన్ బంధోపాధ్యాయ్ విషయంలో మోదీ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య రగడ నడుస్తోంది. మే 31న సీఎస్ పదవికీ ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. దిల్లీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం లేఖ పంపింది. ఈ నేపథ్యంలో కీలక ఎత్తుగడ వేశారు సీఎం మమతా బెనర్జీ. సీఎస్‌గా కొనసాగించకుండా పదవీ విరమణ చేయించి.. సీఎంకు ముఖ్య సలహాదారుగా ఆయనను నియమించారు. మంగళవారం నుంచే అది అమలులోకి వస్తుందని.. వచ్చే మూడేళ్ల పాటు తనకు సలహాదారుగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Farmers protest: 'జూన్ 5న సాగు చట్టాల ప్రతులు దగ్ధం'
ఇదీ చూడండి: ఆ విద్యార్థులకు మోదీ సర్ప్రైజ్