ETV Bharat / bharat

Afghan crisis: 'అఫ్గాన్ సంక్షోభాన్ని ముందే ఊహించాం'

అఫ్గానిస్థాన్​లో పరిస్థితులు(Afghan crisis) భారత్ ఊహించినట్లుగానే జరిగాయని త్రిదళాధిపతి జనరల్​ బిపిన్ రావత్(CDS General Bipin Rawat)​ తెలిపారు. అయితే.. సమయం మాత్రమే మారిందని చెప్పారు. 20 ఏళ్ల క్రితం తాలిబన్లు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే విధంగా ఉన్నారని పేర్కొన్నారు.

author img

By

Published : Aug 25, 2021, 2:40 PM IST

Updated : Aug 25, 2021, 3:06 PM IST

bipin rawat
జనరల్​ బిపిన్ రావత్​, సీడీఎస్​

అఫ్గానిస్థాన్ సంక్షోభంపై(Afghan crisis) కీలక వ్యాఖ్యలు చేశారు త్రిదళాధిపతి జనరల్ బిపిన్​ రావత్(CDS General Bipin Rawat). ముందుగా ఊహించినట్లే ప్రతీది జరిగిందన్నారు. కేవలం సమయం మాత్రమే మారిందని పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకుంటారనే విషయాన్ని భారత్​ ముందుగానే ఊహించిందని చెప్పారు. ఈ మేరకు అమెరికా, భారత్​ భాగస్వామ్యం 21వ శతాబ్ద భద్రతపై జరిగిన సమావేశంలో మాట్లాడారు.

"అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​కు ఉగ్రవాదం వ్యాపిస్తుందని మేం ఆందోళన చెందాం. అందుకే మేం ముందస్తుగా ఆ సవాలును ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాం. కొన్ని నెలల ముందు నుంచే అఫ్గాన్​లో జరగబోయే పరిణామాలను మేం అంచనా వేస్తూ వచ్చాం. అయితే.. సమయం మాత్రమే మారింది తప్ప ఇంకా ఏమీ లేదు. 20 ఏళ్ల క్రితం తాలిబన్లు ఎలా ఉన్నారో ఇప్పుడు తాలిబన్లు అలాగే ఉన్నారు."

-బిపిన్​ రావత్​, త్రిదళాధిపతి.

అఫ్గాన్​ వార్తా కథనాలు, అక్కడి నుంచి వచ్చిన నిర్వాసితుల ద్వారా తాలిబన్లు(Taliban Afghanistan) ఏ విధమైన అరాచకాలకు పాల్పడుతున్నారో తెలుసుకున్నామని జనరల్​ రావత్ తెలిపారు. తాలిబన్ల భాగస్వామ్యులు మాత్రమే మారారు తప్ప ఇంకా ఏమీ మారలేదన్నారు.

"ఇండో పసిఫిక్​, అఫ్గాన్ పరిస్థితిని ఒకటే కోణంలో చూడకూడదు. అవి రెండు విభిన్నమైన అంశాలు. ఈ రెండు ప్రాంతీయంగా భద్రతా సవాళ్లను విసురుతాయి. కానీ, అవి రెండు విభిన్నమైన సరళరేఖలు. అవి రెండు ఎప్పటికీ కలవవు." అని బిపిన్ రావత్​ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ సహాకారం కీలకం అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Afghan Crisis: 'ఉగ్రవాదులకు అఫ్గాన్‌ ఆశ్రయం ఇవ్వొద్దు'

ఇదీ చూడండి: అఫ్గాన్​ నుంచి వచ్చిన 78 మందిలో 16 మందికి కరోనా

Last Updated : Aug 25, 2021, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.