ETV Bharat / bharat

చిన్నారుల సరికొత్త నేస్తం 'ఈటీవీ బాలభారత్'​- నేడే ప్రారంభం - బాల భారత్​

చిన్నారుల వినోదానికి సరికొత్త వేదికను తీసుకురానుంది ఈటీవీ నెట్​వర్క్​. 'బాలభారత్​' పేరుతో దేశవ్యాప్తంగా 11 భాషల్లో.. ఛానళ్లను మంగళవారం ఒకేసారి ప్రారంభిస్తోంది. పిల్లల టెలివిజన్ ప్రపంచాన్ని విభిన్నంగా ఆవిష్కరించనున్న బాలభారత్​.. ఈటీవీ ప్రస్థానంలో మరో కలికితురాయిగా నిలవనుంది.

bala bharat
ప్రాంతీయ భాషల్లో ఈటీవీ బాల భారత్​
author img

By

Published : Apr 26, 2021, 8:23 PM IST

Updated : Apr 27, 2021, 6:19 AM IST

ఈటీవీ బాల భారత్​

పాతికేళ్లుగా వినోదరంగంలో తనదైన ముద్ర వేసిన.. ఈటీవీ నెట్​వర్క్ ఇప్పుడు చిన్నారుల కోసం.. రంగుల హరివిల్లును తీసుకురానుంది. 'బాలభారత్' పేరుతో దేశవ్యాప్తంగా 11 భాషల్లో.. 12 ఛానళ్లను చిన్నారుల కోసం అందిస్తోంది. ఏప్రిల్ 27న(మంగళవారం) రామోజీ ఫిల్మ్​సిటీ వేదికగా.. ఈ 12 ఛానళ్లను ఒకేసారి ప్రారంభించనున్నారు. వార్త, వినోదాల ఛానళ్లతో ప్రతి ఒక్కరిని రంజింపజేస్తున్న 'మీ ఈటీవీ' ఇది చిన్నారులకు అందిస్తున్న కానుక..!

మీకోసం.. మీ భాషలో

స్థానిక భాషలో.. గ్లోబల్ కంటెంట్ అందించాలన్న ఆలోచనతో.. ఈటీవీ 11 భారతీయ భాషల్లో ఈ చానళ్లను తీసుకొస్తోంది. తెలుగుతో పాటు.. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో బాలభారత్ ప్రసారమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మనుసులను గెలుచుకున్న గ్లోబల్ షోలతో పాటు.. దేశీయ వినోదాన్ని బాలభారత్ ఛానళ్లు అందించనున్నాయి. చిన్నారులను ఆశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన కంటెంట్​ను స్థానిక భాషలో అందిస్తూ.. పిల్లల టెలివిజన్ ప్రపంచాన్నే సరికొత్తగా మార్చేందుకు బాలభారత్ వస్తోంది. కార్యక్రమాల విషయంలో ఆయా స్థానిక ప్రాంతాలు, భాష, అభిరుచులకు ప్రాధాన్యతనిస్తూ.. వీక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందివ్వనుంది.

వినోదమే కాదు.. విలువలు కూడా..

జిజ్ఞాసను, ఉత్తేజాన్ని కలిగించేటువంటి అంశాలతో పిల్లల మనసును చూరగొనేలా బాలభారత్ కార్యక్రమాలకు రూపకూల్పన చేస్తోంది. కేవలం వినోదాన్ని అందివ్వడమే కాకుండా.. చిన్నారులల్లో సంస్కారం, విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తుంది. అద్బుతమైన కథలు-కారెక్టర్లు, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే యానిమేషన్, లైవ్ యాక్షన్లతో చిన్నారుల వినోద ప్రపంచం పూర్తిగా మారిపోనుంది. యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, థ్రిల్లర్, ఫాంటసీ వంటి వివిధ విభాగాలతో బాలభారత్.. చిన్నారులను అలరించనుంది. అద్బుతమైన యానిమేషన్ సిరీస్ అభిమన్యు, రోజుకో పిల్లల సినిమా, వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలతో.. ఇక పిల్లలకు ప్రతిరోజూ సంబరమే..!

మరో మైలురాయి

టెలివిజన్ రంగంలో ఈ మధ్యనే పాతికేళ్లు పూర్తి చేసుకున్న ఈటీవీ నెట్​వర్క్.. పిల్లల కోసం ఒకేసారి 12 ఛానళ్లను ప్రారంభించి మరో మైలురాయిని చేరుకుంటోంది.
వార్తాపత్రికలు అయినా.. టెలివిజన్ అయినా.. డిజిటల్​ అయినా.. స్థానిక సంస్కృతి, భాష, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈటీవీ నెట్​వర్క్.. బాలభారత్ విషయంలోనూ అవే ప్రమాణాలను పాటించనుంది. అంతర్జాతీయ కంటెంట్​ను అందిస్తూనే మనదైన ఆత్మను ఆవిష్కరించనుంది. ఈ తరం చిన్నారులకు.. రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు అందిస్తున్న అద్భుతమైన కానుక.. 'బాలభారత్'.

Last Updated : Apr 27, 2021, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.