ETV Bharat / bharat

తండ్రికి 44.. కొడుకుకి 133 ఏళ్లు.. అధికారుల నిర్లక్ష్యంతో కూలీ కుటుంబం అవస్థలు

author img

By

Published : Feb 11, 2023, 7:42 PM IST

రేషన్​ కార్డులో తప్పులతో ఓ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. తల్లిదండ్రుల వయస్సు కంటే కొడుకు వయస్సు ఎక్కువగా నమోదైంది. 14 ఏళ్ల వయస్సు కాస్తా 133 ఏళ్లుగా పడింది. అందెంటో తెలుసుకుందాం.

errors-in-ration-card-bengal-labourer-family-in-trouble
రేషన్​ కార్డ్​లో తప్పుగా నమోదైన వయస్సు

తండ్రి కంటే కొడుకు 88 ఏళ్లు పెద్దవాడయ్యాడు. 14 ఏళ్లకే 133 సంవత్సరాలకు వయస్సుకు చేరాడు. మైనర్​ కాస్తా శతాధిక వృద్ధుడయ్యాడు. ఏంటీ.. ఆశ్చర్యపోతున్నారా? ఆగండి అసలు విషయం తెలుసుకుందాం. ఇందంతా రేషన్ కార్డ్​ తెచ్చిన తంటా. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. బంగాల్​కు చెందిన ఓ 14 ఏళ్ల కుర్రాడిని 133 వయస్కున్ని చేశారు అధికారులు. కొడుకు కంటే తండ్రిని చిన్నవాడిని చేశారు. నదియా జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఈ వింత సమస్యలు ఎదుర్కొంటోంది.

సాధన్ కర్మాకర్(45). దక్షిణపారాలోని బబ్లా గ్రామానికి చెందిన వ్యక్తి. అతని భార్య శ్రబాని.. 37 సంవత్సరాలు. కొడుకు పేరు సూర్య కర్మాకర్​.. వయస్సు 14 సంవత్సారాలు. గతంలో సాధన్​ కుటుంబం బట్టలు నేసేవారు బతికేవారు. సొంతూరులో సరైన ఉపాధి అవకాశాలు లేక మహారాష్ట్రకు వలస వెళ్లారు. అక్కడే కుటుంబమంతా కూలి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి వీరికి ఓ సమస్య వచ్చి పడింది. రేషన్​ కార్డ్​లో కొడుకు వయస్సు తక్కవగా నమోదైంది. ఇది గమనించిన సూర్య తల్లిదండ్రులు వెంటనే బంగాల్​ పయనమయ్యారు. అనంతరం అధికారులకు ఆర్జీ పెట్టుకున్నారు. సమస్యను పరిష్కరించవలసిందిగా వారిని కోరారు.

నా కొడుకు వయస్సు రేషన్ కార్డ్​లో తప్పుగా నమోదైంది. ఈ తప్పు ఎలా జరిగిందో నాకు తెలియదు. ఇదేమి మొదటి సారి కాదు. గతంలోను నా కొడుకు పేరు రేషన్​ కార్డ్​లో తప్పుగా పడింది. సూర్య కాస్తా సుబ్రతగా మారింది. దీంతో అధికారులు చుట్టు చాలా సార్లు తిరిగి ఆ పేరు సరిచేయించుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఇలా జరిగింది. అని శ్రబాని తెలిపారు. రేషన్​కార్డ్​లో నమోదైన తప్పుడు వివరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

మహారాష్ట్ర నుంచి పనులు మానుకొని మరి వచ్చానన్నారు శ్రబాని. అధికారులకు మరోసారి మొర పెట్టుకున్నాని ఆమె తెలిపారు. దీన్ని సరి చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని వారు చెప్పారన్నారు. రేషన్​కార్డ్​లో వివరాలు తప్పు ఉన్న కారణంగా చాలా సమస్యలు ఎదురవుతున్నయని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ సమస్యను వీలైనంతా త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని స్థానిక రేషన్​ డీలర్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.