ETV Bharat / bharat

కశ్మీర్​ పర్యటనకు ఐరోపా,ఆఫ్రికా ప్రతినిధుల బృందం!

ఐరోపా, ఆఫ్రికా ప్రతినిధుల బృందం జమ్ముకశ్మీర్​ను సందర్శించనుందని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల తర్వాత ఆ ప్రాంతంలోని పరిస్థితుల గురించి తెలుసుకోనుందని వెల్లడించారు.

Envoys from Europe, Africa to visit J-K to assess situation after DDC polls: Officials
కశ్మీర్​ పర్యటనకు ఐరోపా,ఆఫ్రికా ప్రతినిధుల బృందం!
author img

By

Published : Feb 15, 2021, 6:39 AM IST

జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల తర్వాత అభివృద్ధి, భద్రతా పరిస్థితులను తెలుసుకోవడానికి ఐరోపా, ఆఫ్రికా ప్రతినిధుల బృందం జమ్ముకశ్మీర్​లో పర్యటించనుందని అధికారులు తెలిపారు. ఈ బృందం ఫిబ్రవరి 17 నుంచి రెండు రోజుల పాటు సందర్శించే అవకాశం ఉందని వెల్లడించారు.

దీనిలో భాగంగా జమ్ముకశ్మీర్​ ప్రత్యేక హోదా రద్దు తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కీలక విషయాలు తెలుసుకోనున్నారు. కొందరు పౌరులు, పరిపాలన కార్యదర్శులతో భేటీ కానున్న ప్రతినిధులు.. డీడీసీ ఎన్నికల్లో గెలిపొందిన కొంతమందిని కలుస్తారని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: జ్ఞాపకశక్తి పెరుగుతుందని పిల్లలకు సెలైన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.