ETV Bharat / bharat

Telangana Engineering Seats : ఈసారి ఇంజినీరింగ్​ సీట్లు ఎన్నంటే..? - 2023 తెలంగాణ ఇంజినీరింగ్​ సీట్లు

Engineering
Engineering
author img

By

Published : Jun 27, 2023, 5:52 PM IST

Updated : Jun 27, 2023, 10:21 PM IST

17:45 June 27

Telangana Engineering Seats : ఇంజినీరింగ్ సీట్లు ఖరారు చేసిన రాష్ట్ర విద్యాశాఖ.. రేపటి నుంచే వెబ్​ ఆప్షన్లు

Engineering Seats Counseling In Telangana From Tomorrow : ఇంజినీరింగ్​ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్​ సీట్లు ఖరారు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 137 ప్రైవేటు కాలేజీల్లో 80,091 ఇంజినీరింగ్​ సీట్లు ఉన్నాయని వెల్లడించింది. 16 యూనివర్సిటీ కాలేజీల్లో 4,713 ఇంజినీరింగ్​ సీట్లు ఖాళీ ఉన్నాయని తెలిపింది. రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,302 సీట్లు ఉన్నాయని.. ఈ ఏడాది కన్వీనర్​ కోటాలో 62,079 ఇంజినీరింగ్​ సీట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. సీఎస్ఈ, ఇతర ఐటీ కోర్సుల్లోనే 45,885 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. సుమారు మరో పదివేల సీట్లు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ.. జేఎన్టీయూహెచ్, ఓయూ, కేయూ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశాయి.

TS Engineering Counselling Schedule 2023 : ఈ ఏడాది వివిధ కాలేజీల్లో అత్యధికంగా సీఎస్ఈలో 16,617.. ఈసీఈలో 10,394 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్ కోర్సులో 8,154.. డేటా సైన్స్​లో 4,635, సైబర్ సెక్యూరిటీలో 1,404, ఐఓటీలో 588 సీట్లు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3,936, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సులో 1,554 సీట్లు ఉన్నాయి. ట్రిపుల్ ఈలో 4,454, సివిల్​లో 3,567, మెకానికల్ లో 3,147 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్​ కోటాలో మరో 10 శాతం సీట్లు కేటాయించనున్నారు.

Telangana Engineering Seats 2023 : కొత్తగా కోర్సులు రాకపోయినప్పటికీ.. డిమాండ్ ఉన్న కోర్సుల్లో కొన్ని పెరిగాయి. గత రెండేళ్లుగా పలు కాలేజీలు మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సుల్లో సీట్లను వెనక్కి ఇచ్చి.. కంప్యూటర్ సంబంధిత కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ఈ ఏడాది పలు కాలేజీలు సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ వంటి కోర్సుల్లో సుమారు పదివేల సీట్లను తగ్గించుకొని.. వాటి స్థానంలో సీఎస్‌ఈ, ఏఐఎంఎల్, డేటా సైన్స్ వంటి కోర్సులకు అనుమతి కోరాయి. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ సీట్లు కూడా త్వరలో అందుబాటులోకి రావచ్చునని భావిస్తున్నారు. ఎన్‌బీఏ అనుమతి ఉన్న కాలేజీలు మరో 4 వేల అదనపు సీట్లకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేపటి నుంచి ఆగస్టు 8 వరకు వెబ్ ఆప్షన్ల గడువు ఉంది.

ఇవీ చదవండి :

Last Updated : Jun 27, 2023, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.