Encounter in UP : రైలులో ఓ మహిళా కానిస్టేబుల్‌ను తీవ్రంగా గాయపరిచిన ఓ నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు. కొంతకాలంగా పరారీలో ఉన్న అతడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు కూడా గాయపడ్డారని యూపీ పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరయూ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఆగస్టు 30న దాడి జరిగింది. సీటు విషయంలో ఆమెతో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. అది కాస్త ఘర్షణగా మారింది. నిందితుడు తన స్నేహితుడితో కలిసి ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. రైలు అయోధ్య స్టేషన్ రాగానే వారంతా రైలుదిగి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. రైలులో రక్తపు మడుగులో స్పృహకోల్పోయి ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వాట్సప్‌లో వైరల్ అయిన వార్తలను సుమోటోగా స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు.. యూపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని సంబంధిత పోలీసులను ఆదేశించింది.
పోలీసు అధికారికి తూటా దెబ్బ..
న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రధాన నిందితుడిని అనీశ్ ఖాన్‌గా గుర్తించారు. అతడిని పట్టుకోవడానికి అయోధ్యలో పోలీసులు సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే పోలీసులను చూసిన అనీశ్, అతడి స్నేహితులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎన్‌కౌంటర్ జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో గాయపడ్డ అనీశ్.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో మరో ఇద్దరు నిందితులతో సహా ఓ పోలీసుకు తూటా గాయాలయ్యాయని వారు తెలిపారు.
ఎన్‌కౌంటర్‌లో వాంటెడ్ క్రిమినల్ హతం!
Gufran Encounter : ఈ ఏడాది జూన్ ఆఖరి వారంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ మరణించాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇతడు హతమయ్యాడు. కాగా, ఆజాద్‌నగర్‌కు చెందిన గుఫ్రాన్ 13 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన కౌశాంబీ జిల్లాలోని మంఝన్పుర్ సమీపంలోని షుగర్ మిల్లు వద్ద జూన్ 27(మంగళవారం) తెల్లవారుజామును 5 గంటల ప్రాంతంలో జరిగింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Gufran Encounter : యూపీలో మళ్లీ ఎన్‌కౌంటర్.. వాంటెడ్ క్రిమినల్ హతం
కారు ఆపిన పోలీసులపై బాంబు దాడి.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు మృతి