ETV Bharat / bharat

దెబ్బకు దెబ్బ- ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం- కీలక స్నైపర్ ఉగ్రవాది సైతం!

Encounter In Rajouri Today : జమ్ము కశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. పౌరులే లక్ష్యంగా జరిగిన దాడులకు కారకుడిగా భావిస్తున్న ఉగ్రవాది కాల్పుల్లో హతమైనట్లు తెలిపింది. స్నైపర్, ఐఈడీ నిపుణుడు అయిన అతడు.. కశ్మీర్​లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు ప్రయత్నించాడని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.

Encounter In Rajouri Today
Encounter In Rajouri Today
author img

By PTI

Published : Nov 23, 2023, 4:00 PM IST

Updated : Nov 23, 2023, 9:12 PM IST

Encounter In Rajouri Today : జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలకు, తీవ్రవాదులకు మధ్య రెండో రోజూ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. IED నిపుణుడు, స్నైపర్‌ అయిన పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాదిని మొదట మట్టుబెట్టినట్లు రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. డంగ్రీ, కండీ దాడుల్లో అతడే కీలక సూత్రధారని అనుమానిస్తున్నారు. కాసేపటికే మరో ముష్కరుడు బలగాల కాల్పుల్లో హతమయ్యాడు. ఘటనా స్థలి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో మరో జవాను అమరుడయ్యాడు. దీంతో ఈ ఆపరేషన్​లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 5కు చేరింది.

రాజౌరీ జిల్లాలోని బజిమాల్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో.. నలుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం రాత్రి నుంచి ఆ ప్రాంతాన్ని దిగ్భంధించిన సాయుధ బలగాలు నిర్భంధ తనిఖీ చేపట్టాయి. ఈ ఉదయం నుంచి ముష్కరుల వేట ప్రారంభించిన భద్రతా బలగాలు ఇద్దరిని మట్టుబెట్టాయి. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో.. ముష్కరులు తప్పించుకోకుండా రాత్రంతా జాగ్రత్తలు తీసుకున్నట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.

'మృతుల్లో ఒకరిని ఐఈడీ నిపుణుడైన ఖువారీగా గుర్తించాం. అతడు పాకిస్థాన్, అఫ్గాన్ ఫ్రంట్​లో శిక్షణ తీసుకున్నాడు. లష్కరే తొయిబాలో కీలక ర్యాంకు కలిగిన ఉగ్రవాది అతడు. ఏడాది కాలంగా తన బృందంతో రాజౌరీ- పూంచ్ ప్రాంతంలో ఖువారీ క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. డాంగ్రీ, కండీ దాడుల మాస్టర్​మైండ్ కూడా అతడే అని అనుమానిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకే అతడిని ఇక్కడికి పంపించారు' అని రక్షణశాఖ ప్రతినిధి వివరించారు.
కాగా, ఈ ఏడాది జనవరిలో డంగ్రీలో పలువురు పౌరులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగాయి.

ఒమర్, ముఫ్తీ విచారం
బుధవారం నలుగురు జవాన్లు అమరులు కావడంపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. పీర్ పంజల్ లాంటి శాంతియుత ప్రాంతాల్లో ఉగ్రవాదం వ్యాప్తికి జరుగుతున్న ప్రయత్నాలను ఒమర్ ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జమ్ము కశ్మీర్​లో అంతా సవ్యంగానే ఉందని కేంద్రం తప్పుడు ప్రకటనలు చేస్తోందని, సరిహద్దులో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు.

పేలుడు పదార్థాల బాక్సు స్వాధీనం
జమ్ము కశ్మీర్ అఖ్నూర్‌ సెక్టార్‌లోని వాస్తవాదీన రేఖ వద్ద ‌పేలుడు పదార్థాల బాక్సును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పెట్టెలో ఆయుధాలు, యుద్ధ సామగ్రి, 9 గ్రనేడ్లు, ఒక ఐఈడీని గుర్తించినట్లు వెల్లడించారు. పోలీసులు, ఆర్మీ బలగాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ బాక్సును గుర్తించినట్లు వెల్లడించారు. వాస్తవాదీన రేఖకు సమీపంలో ఉన్న పలన్‌వాల్లహ్‌ వద్ద తెల్లవారుజామున సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఉపయోగించడానికి ఈ ఐఈడీ బాక్సును డ్రోను ద్వారా జారవిడిచినట్లు భావిస్తున్నారు. ఈ పేలుడు పదార్థాల బాక్సు గతంలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు జారవిడిచిన బాక్సు మాదిరిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Arms box in LoC Jammu
బాక్సులో దొరికిన గ్రెనేడ్లు, తుపాకీ, బుల్లెట్లు
  • #WATCH | Jammu & Kashmir | A box dropped from a drone was recovered by J&K Police in Akhnoor. 9 grenades, one Pistol, 38 rounds and one IED were recovered from the box: J&K Police pic.twitter.com/Y8TruUIWQF

    — ANI (@ANI) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Army Dog Kent Died : ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన వీర శునకం మృతి.. కాల్పుల్లో ముగ్గురు సైనికాధికారులు మృతి

Kupwara Encounter : దేశంలోకి చొరబాటుకు యత్నం.. ఎన్​కౌంటర్​లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

Last Updated : Nov 23, 2023, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.