ETV Bharat / bharat

భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. టార్గెట్ మోదీ​! - జమ్మూలో మోదీ పర్యటన

Encounter in Jammu Kashmir: జమ్ముకశ్మీర్​లో ప్రధాని మోదీ పర్యటనే లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన ఆత్మాహుతి దళంలోని ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. మోదీ పర్యటనలో విధ్వంసం సృష్టించటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లక్ష్యంతో భారీ కుట్ర జరిగినట్లు పేర్కొన్నారు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​.

ENCOUNTER
భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర
author img

By

Published : Apr 22, 2022, 3:49 PM IST

Encounter in Jammu Kashmir: జమ్ముకశ్మీర్​లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. పోలీసుల కాల్పుల్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థాన్​కు చెందిన జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ ఆత్మాహుతి దళానికి చెందిన వారని వెల్లడించారు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్ పర్యటనలో విధ్వంసం సృష్టించాలనే కుట్రతోనే వారు సరిహద్దులు దాటి భారత్​లోకి ప్రవేశించారని తెలిపారు.

" గత రాత్రి నుంచి పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్​లో పాల్గొన్నారు. జైషే ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారు సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ విధ్వంసం సృష్టించేందుకు వచ్చారు. ప్రధాని మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. జమ్ముకశ్మీర్​లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు, ప్రధాని పర్యటనలో విధ్వంసం సృష్టించేందుకు జరిగిన భారీ కుట్ర ఇది. మాకు సరైన సమయంలో సమాచారం అందటం వల్ల ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేశాం."

- దిల్బాగ్​ సింగ్​, జమ్ముకశ్మీర్​ డీజీపీ

5 గంటలు సాగిన గన్​ఫైట్​: జమ్మూ శివారు ప్రాంతంలోని సుంజ్వాన్​ ఆర్మీ క్యాంప్​ సమీపంలో తెల్లవారుజామున 4.25 గంటల సమయంలో ముష్కరుల కదలికలను గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. వారి నుంచి తప్పించుకునేందుకు నివాస ప్రాంతాల్లోకి పారిపోయారు ఉగ్రవాదులు. వారిని మట్టుబెట్టేందుకు నిర్భంద తనిఖీలు చేపట్టగా కాల్పులకు పాల్పడ్డారు. సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ సీఐఎస్​ఎఫ్​ అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్​ వీరమరణం పొందారు. మరో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, గ్రెనేడ్లు, ఆత్మాహుతి దాడికి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు డీజీపీ. ఉగ్రమూకల కదలికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఉగ్రవాదులు సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా గత గురువారం జమ్మూ నగరంలోకి ప్రవేశించారని.. ఆర్మీ క్యాంప్​కు సమీపంలోని నివాస ప్రాంతంలో తలదాచుకున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

మోదీ పర్యటన: ఈ నెల 24న జాతీయ పంచాయతీ రాజ్​ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూలోని పాలి గ్రామాన్ని సందర్శించనున్నారు. 2019లో జమ్ముకశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి హోదా రద్దు అనంతరం తొలిసారిగా జమ్మూలో పర్యటించనున్నారు. అంతకుముందు 2019 అక్టోబర్​ 27న రాజౌరి, నవంబర్​ 3 2021న నౌషేరా సెక్టార్​లో జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడకులు చేసుకున్నారు.

ఇదీ చూడండి: కోర్టు ఆవరణలో కాల్పులు - క్లయింట్ల మధ్య గొడవే కారణం

Attack on RI: అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న ఆర్​ఐపై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.