ETV Bharat / bharat

గజరాజుల ప్రతాపానికి ముగ్గురు బలి - మధ్యప్రదేశ్​లో సంజయ్​ గాంధీ టైగర్​ రిజర్వ్​ కు సమీపంలో ఏనుగుల బీబత్సానికి ముగ్గురు బలి

మధ్యప్రదేశ్​లోని సిద్ధి జిల్లాలో ఘోరం జరిగింది. ఏనుగుల మంద ప్రతాపానికి ఇద్దరు పిల్లలు, ఓ వృద్ధుడు మృతి చెందారు.

elephant trampled three people by foot painful death in sidhi
గజరాజుల ప్రతాపానికి ముగ్గురు బలి
author img

By

Published : Feb 23, 2021, 5:38 PM IST

Updated : Feb 23, 2021, 5:47 PM IST

మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. గజరాజులు ఇద్దరు పిల్లలు, ఓ వృద్ధుడిని చంపేశాయి. సిద్ధి జిల్లాలోని సంజయ్​ గాంధీ టైగర్​ రిజర్వ్​కు సమీపంలో గల హైకీ గ్రామంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

"సోమవారం రాత్రి ఏనుగుల గుంపు ఒక్కసారిగా గ్రామంపై పడింది. గోరెలాల్​ యాదవ్​ అతని మనుమలు రామ్​క్రిపాల్​ (12), రామ్​ ప్రసాద్​(13) ఇంటి నుంచి బయటపడి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఏనుగుల మంద వారిని కింద పడేసి కాళ్లతో తొక్కేసింది. బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు" అని సంజయ్​ గాంధీ టైగర్​ రిజర్వ్​ సబ్​-డివిజనల్​ అధికారి జయా త్రిపాఠీ తెలిపారు.

ఈ ఘటనతో గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. తిల్వారి- జానక్​పూర్​ రహదారిని దిగ్బంధించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: కర్ణాటకలో జిలెటిన్​ పేలి ఆరుగురు మృతి

Last Updated : Feb 23, 2021, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.