ఓ వ్యక్తిని చంపిన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మిత్తూ అనే ఏనుగు విడుదల కాబోతోంది. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ కమిషనర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
అసలేం జరిగింది..
2020 అక్టోబర్ 20న రామ్‌లీలా మైదానంలో మిత్తు అనే ఏనుగు ప్రదర్శన చేసి తిరిగి వస్తుండగా దారిలో కొందరు దాన్ని వేధించారు. దాంతో దానికి కోపం వచ్చి ఒకరిని చంపేసింది.
ఏనుగు మిత్తు, దాని యజమాని మహౌత్ మీద బాబురీ పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదయింది. మహౌత్కు బెయిల్ వచ్చింది. కానీ మిత్తుకి ఏదాదిన్నర శిక్ష పడింది. ఆ ఏనుగును బిహార్‌లోని చందౌలీ రాంనగర్ అటవీ జంతు సంరక్షణాలయంలో పర్యవేక్షణలో ఉంచారు.
అయితే ఎక్కువ రోజులు బందించే ఉంచడం వల్ల ఏనుగు సరిగా కూర్చోలేక, నడవలేక పోతోంది. ఈ విషయం వారణాసి కమిషనర్‌కు తెలిసింది. వెంటనే ఆయన దాన్ని పెరోల్ మీద బయటకు తీసుకురావాలని దిల్లీ జూ డైరక్టర్ రమేశ్ పాండేతో మాట్లాడారు. త్వరలో మిత్తూని లఖింపుర్ ఖేరీలోని దుద్వా జాతీయ పార్క్‌లో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రోజంతా రావిచెట్టుపైనే మకాం.. ఎందుకంటే?