ETV Bharat / bharat

'ప్రభుత్వ అధికారులందరూ విద్యుత్​ వాహనాలే వాడాలి' - Electric vehicles latest news

అన్ని ప్రభుత్వ శాఖల్లోని అధికారులు విద్యుత్​ వాహనాలే వాడాలని ప్రతిపాదించారు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ. ఈ క్రమంలో విద్యుత్‌ను ఉపయోగించి వంట చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇది వంటగ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.

Electric vehicles usage should be made mandatory for all govt officials: Gadkari
'ప్రభుత్వ అధికారులందరూ విద్యుత్​ వాహనాలే వాడాలి'
author img

By

Published : Feb 19, 2021, 5:25 PM IST

అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల్లోని అధికారులు తప్పనిసరిగా ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రతిపాదించారు. దీనితో పాటు వంటగ్యాస్‌కు రాయితీ ఇచ్చే బదులు ఎలక్ట్రిక్‌ వంట పరికరాలకు ఇవ్వాలని సూచించారు.

గో ఎలక్ట్రిక్‌ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ.. విద్యుత్‌ను ఉపయోగించి వంట చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇది వంటగ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ శాఖలో అధికారులంతా ఎలక్ట్రిక్‌ వాహనాలనే వాడేలా ఆదేశించాలని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్​కే సింగ్‌ను కోరారు.

పది వేల ఎలక్ట్రిక్‌ వాహనాలతో దిల్లీలో నెలకు 30 కోట్ల రూపాయల ఆదా చేయవచ్చని గడ్కరీ తెలిపారు. మరోవైపు త్వరలో దిల్లీ నుంచి ఆగ్రా, జైపుర్​కు ఫ్యూయల్‌సెల్‌ బస్‌ సేవలను ప్రారంభిస్తామని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్​కే సింగ్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి: 'భాజపా అధికారంలోకి వస్తే సీఎం పదవికి సై'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.