ETV Bharat / bharat

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గెలుపెవరిదో - ఈసారి హోరాహోరీ తప్పదా? - telangana latest news

Election Fight in Greater Hyderabad : రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఎన్నికల రాజకీయం రంజుగా మారింది. త్రిముఖ పోటీ నెలకొన్న మెజార్టీ నియోజకవర్గాల్లో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గెలుపు ఖాయమనుకున్న నియోజకవర్గాల్లో కూడా పోరు అనూహ్యంగా రసవత్తరంగా మారుతోంది. రోజుకో రకంగా సమీకరణాలు మారుతున్నాయి. అగ్రనేతల ప్రచారంతో పరిస్థితులు తారుమారవుతున్నాయి. ప్రాంతీయ, సామాజిక, ఇతర సమీకరణాలతో పాటు బస్తీలు గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయా వర్గాల ఓట్లే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహాలతో ముందుకెళ్తున్నారు.

Election Fight in Greater Hyderabad
Election Fight in Greater Hyderabad
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 5:32 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గెలుపెవరిదో - ఈసారి హోరాహోరీ తప్పదా?

Election Fight in Greater Hyderabad : రాష్ట్ర రాజకీయంలో గ్రేటర్ హైదరాబాద్, పరిసర ప్రాంతాలు అత్యంత కీలకం. నాలుగో వంతుకు పైగా స్థానాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి గెలుపు ఓటములు రాష్ట్ర ఫలితాలను నిర్దేశిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజధాని, పరిసర ప్రాంతాల్లో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. కొన్ని నియోజకవర్గాలు మినహాయిస్తే మెజార్టీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ(Telangana Election Fight) నెలకొంది. మరికొన్ని చోట్ల చతుర్ముఖ పోటీ కూడా ఉంది. విభిన్న ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజలు ఉన్న ఈ ప్రాంతంలో ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

పాతబస్తీలో మజ్లిస్‌కు బాగా పట్టుంది. చార్మినార్, యాకుత్ పురా, నాంపల్లి, బహదూర్‌పురాలో మజ్లిస్ అభ్యర్థులను మార్చింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాల్లో మూడు చోట్ల ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. నాంపల్లిలో కాంగ్రెస్(Congress) అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నుంచి పోటీ బాగా ఉండగా.. యాకుత్‌పురాలో ఎంబీటీ అభ్యర్థి అమ్జేద్‌ ఉల్లాఖాన్ బరిలో దిగడం సవాల్‌గా మారింది. మలక్‌పేటలో కాంగ్రెస్ అభ్యర్థి మజ్లిస్‌కు ధీటుగా ప్రజల్లోకి వెళ్తున్నారు.

తుది దశకు చేరుకున్న ఎన్నికల ప్రచారాలు - హాట్ ​హాట్​గా ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రసంగాలు

గోషామహల్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ : గోషామహల్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్‌(BRS vs BJP) మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ మధ్య పోటీ ఉంది. అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీజేపీ నుంచి మాజీ మంత్రి కృష్ణయాదవ్, కాంగ్రెస్ తరపున రోహిణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఖైరతాబాద్‌లోనూ త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్, కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ తరపున బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు.

జూబ్లీహిల్స్‌లో చతుర్ముఖ పోటీ ఉంది. బీఆర్‌ఎస్‌ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్, మజ్లిస్ నుంచి ఫరాజుద్దీన్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. సనత్ నగర్‌లో త్రిముఖ పోరు నెలకొంది. బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు బరిలో దిగగా.. కాంగ్రెస్, బీజేపీ నుంచి కోట నీలిమ, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో ఉపసభాపతి పద్మారావు బీఆర్‌ఎస్‌ తరఫున పోటీలో ఉండగా.. కాంగ్రెస్ తరపున ఆదం సంతోష్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా మేకల సారంగపాణి పోటీ చేస్తున్నారు. కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థి లాస్య నందిత, కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల, బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్ పోటీలో ఉన్నారు.

ప్రచారాలతో హోరెత్తిస్తున్న కాంగ్రెస్​, బీజేపీలు - అధికారమే లక్ష్యంగా హామీలతో సుడిగాలి పర్యటనలు

Telangana Election Polls 2023 : ఎల్బీనగర్‌లో త్రిముఖ పోరు ఉన్నా.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్(BRS vs Congress) అభ్యర్థులు సుధీర్ రెడ్డి, మధుయాష్కి మధ్య పోరు హోరాహోరీగా ఉంది. బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. మహేశ్వరంలో త్రిముఖ పోరు నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీజేపీ అభ్యర్థి అందె శ్రీరాములు యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మల్ రెడ్డి రంగారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇక్కడ సీపీఎం, బీజేపీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. రాజేంద్రనగర్‌లో చతుర్ముఖ పోరు నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్, బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి, మజ్లిస్ అభ్యర్థి స్వామియాదవ్ పోటీలో ఉన్నారు.

Telangana Election Campaign 2023 : శేరిలింగంపల్లిలో త్రిముఖ పోరు ఉంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్‌తో పాటు బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. కూకట్ పల్లిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్ మధ్య పోటీ నెలకొంది. జనసేన తరఫున ప్రేమ్ కుమార్ బరిలో ఉన్నారు. పటాన్ చెరులో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ గౌడ్, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బరిలో ఉన్నారు. బీఎస్పీ తరపున నీలం మధు ముదిరాజ్ పోటీలో ఉన్నారు.

Three Partys Fight in Greater Hyderabad : కుత్బుల్లాపూర్‌లోనూ మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, కాంగ్రెస్ తరఫున కొలను హన్మంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కూన శ్రీశైలం గౌడ్ బరిలో ఉన్నారు. మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు తలపడుతున్నారు. ఉప్పల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి పరమేశ్వర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోటీలో ఉన్నారు.

అసెంబ్లీ సమరానికి సై అంటున్న భాగ్యనగరం - పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా అధికార యంత్రాంగం

గెలిచే అవకాశాలున్న స్థానాలపై బీజేపీ స్పెషల్​ ఫోకస్​ - జాతీయ నాయకుల రోడ్ షోలు, సభలతో బిజీబిజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.