బంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా.. కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్తో పాటు నేటి నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈ బృందం సమీక్ష నిర్వహించనుంది.
ఈరోజు సాయంత్రం గువాహటి చేరుకోనుంది అరోడా బృందం. మూడు రోజుల తర్వాత జనవరి 20న కోల్కతాకు పయనం కానుంది.
గతవారం నుంచి డిప్యూటీ ఎ్నకల కమిషనర్ సుదీప్ జైన్ బంగాల్లో ఉన్నారు. మరో అధికారి అసోంలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తుంది. అయితే ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం షెడ్యూల్ ప్రకటించాక బృందం పర్యటించింది.
బంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిలో త్వరలో వరుసగా ఎన్నికలు జరగనున్నాయి.
- ఇదీ చూడండి: బంగాల్ ఎన్నికల బరిలో శివసేన