Campaign restrictions Assembly Elections: కరోనా వ్యాప్తి వేళ ప్రచారాలపై ఆంక్షలు విధించిన భారత ఎన్నికల సంఘం.. వాటిని క్రమంగా సడలిస్తోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రాజకీయ పార్టీలు, నేతలు ప్రచారాలు నిర్వహించుకోవచ్చని తాజాగా స్పష్టం చేసింది. రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు ప్రచారాలపై నిషేధం ఉండగా.. దీన్ని సడలించింది ఈసీ.
రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించిన మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో 50 శాతం సామర్థ్యంతో రాజకీయ ర్యాలీలు, సభలు నిర్వహించుకోవచ్చని ఈసీ తెలిపింది. ఈ విషయంలో ఎస్డీఎంఏ నిర్ణయించే కనిష్ఠ పరిమితిని పాటించాలని స్పష్టం చేసింది.
EC relaxes Campaign restrictions
పాదయాత్రలు నిర్వహించాలనుకుంటే జిల్లా అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఈసీ పేర్కొంది. దీనికి హాజరయ్యే జనం విషయంలోనూ ఎస్డీఎంఏ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని సమీక్షించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది.
ఇదీ చదవండి: సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష.. అందులో నెగ్గితేనే...