తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోంలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. బంగాల్‌లోనూ మూడో దశలో పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచార గడువు ముగిసింది. మంగళవారం ఓటింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
మొత్తం 824 సీట్లకు ఈసారి ఎన్నికలు జరుగుతుండగా.. 2.7లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 18.68 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నట్టు స్పష్టం చేసింది.
బంగాల్లో..
మొత్తం 294 సీట్లు గల రాష్ట్రంలో ఇప్పటివరకు 60 సీట్లకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మూడో దశలో భాగంగా మరో 30 సీట్లకు పోలింగ్ జరగనుంది.
బంగాల్లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
అసోం..
అసోం ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు విడతలు పూర్తికాగా మూడో విడత ఈనెల 6న జరగనుంది. తొలి రెండు విడతల్లో 86 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం మిగిలిన 40 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది.
తమిళనాడు..
స్థానిక పార్టీలతో పాటు జాతీయ పార్టీలకు కీలకమైన రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడులో ఎన్నికలు ఈనెల 6న జరగనున్నాయి. మొత్తం 234 స్థానాలకు ఎన్నికల కమిషన్ ఒకే దశలో పోలింగ్ నిర్వహించనుంది.
కేరళ..
కేరళలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది.
పుదుచ్చేరి
ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఇదీ చదవండి : భాజపా నేత కారులో ఈవీఎం- రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం