ETV Bharat / bharat

'సుస్థిర అఫ్గాన్​కు మద్దతిస్తాం.. ఉగ్ర కార్యకలాపాలను సహించం!' - ఆఫ్ఘనిస్తాన్ లేటెస్ట్ న్యూస్ telugu

అఫ్గానిస్థాన్ సంక్షోభంపై చర్చించేందుకు సమావేశమైన (India meeting on Afghanistan) ఎనిమిది దేశాలు.. కీలక ప్రకటన చేశాయి. సుస్థిరమైన, శాంతియుతమైన అఫ్గానిస్థాన్​కు మద్దతు ప్రకటించాయి. అఫ్గాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకంగా (Delhi Declaration) తీర్మానించాయి. అఫ్గాన్ గడ్డను ఉగ్రకార్యకలాపాల కోసం వినియోగించకూడదని స్పష్టం చేశాయి.

AFGHAN DELHI DECLARATION
AFGHAN DELHI DECLARATION
author img

By

Published : Nov 10, 2021, 3:06 PM IST

Updated : Nov 10, 2021, 4:10 PM IST

భారత్ నేతృత్వంలో సమావేశమైన (India meeting on Afghanistan) ఎనిమిది దేశాలు.. అఫ్గానిస్థాన్ అంశంలో కీలక అవగాహనకు వచ్చాయి. సుస్థిర, శాంతియుత, సురక్షితమైన అఫ్గానిస్థాన్ ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. అఫ్గాన్ సంక్షోభంపై చర్చించిన అనంతరం ఈ మేరకు 'దిల్లీ డిక్లరేషన్' పేరిట ఉమ్మడి ప్రకటన (India meeting on Afghanistan) విడుదల చేశాయి. అఫ్గానిస్థాన్​లో నిజమైన సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాయి. అఫ్గాన్​లోని అన్ని వర్గాల ప్రజలకు అందులో భాగస్వామ్యం కల్పించాలని పేర్కొన్నాయి.

అఫ్గాన్ సార్వభౌమత్వం, సమగ్రతకు గౌరవం ఇస్తున్నట్లు 'దిల్లీ డిక్లరేషన్'లో (NSA meet on Afghanistan) తెలిపాయి. అఫ్గాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకంగా (Delhi Declaration) తీర్మానించాయి. అయితే, అఫ్గాన్​లో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగకూడదని తేల్చిచెప్పాయి. ఆ దేశాన్ని ముష్కరులు ఉపయోగించకుండా చూడాలని స్పష్టం చేశాయి. ఉగ్ర శిక్షణ, ఆశ్రయం కల్పించడం, దాడులకు కుట్రలు, ఆర్థిక సహాయం సహా ఎలాంటి కార్యకలాపాలు ఉండకూడదని (Delhi Declaration UPSC) నొక్కిచెప్పాయి. అఫ్గాన్​లో భద్రతాపరమైన పరిస్థితులు సహా ఉగ్రవాదం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంపై ఎనిమిది దేశాలు (India meeting on Afghanistan) ఆందోళన వ్యక్తం చేశాయి. కుందుజ్, కాందహార్, కాబుల్ నగరాల్లో జరిగిన దాడులను ఖండించాయి.

"అఫ్గానిస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఐరాసది కీలక పాత్ర. అఫ్గాన్​లో ఐరాస విభాగాలు తమ కార్యకలాపాలు కొనసాగించడం అవసరం. అఫ్గాన్​లో సామాజిక ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు మానవతా సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అఫ్గాన్​కు అందించిన సహాయం.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమానంగా, వివక్ష లేకుండా అందాలి."

-దిల్లీ డిక్లరేషన్​

రష్యా, ఇరాన్, తజికిస్థాన్​, కిర్జిస్థాన్​, కజఖ్​స్థాన్​, ఉజ్బెకిస్థాన్​, తుర్క్​మెనిస్థాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో భారత్.. ఈ భేటీ (NSA meeting on Afghanistan) నిర్వహించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్.. ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం భారత్​కు గర్వకారణమని సమావేశం (NSA meet on Afghanistan) సందర్భంగా డోభాల్ వ్యాఖ్యానించారు. అఫ్గానిస్థాన్ పరిస్థితులు అక్కడి ప్రజలపైనే కాకుండా.. పొరుగు దేశాలపైనా ప్రభావం చూపిస్తాయని అన్నారు.

మోదీని కలిసి...

ఈ సమావేశం అనంతరం డోభాల్​తో పాటు ఏడు దేశాల ప్రతినిధులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వారితో మోదీ కాసేపు సమావేశమయ్యారు.

india nsa meet on afghanistan
డోభాల్ సహా వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో మోదీ
india nsa meet on afghanistan
మోదీతో భేటీ అయిన ప్రతినిధులు

భేటీపై తాలిబన్ స్పందన..

భారత్​లో జరిగిన కీలక భేటీపై తాలిబన్లు స్పందించారు. ఈ సమావేశంపై తాము ఆశావాద దృక్ఫథంతో ఉన్నామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిత్ పేర్కొన్నారు.

భారత్​లో భేటీకి గైర్హాజరు..

అఫ్గాన్ సమస్యపై చర్చించేందుకు ఇన్ని దేశాలతో భారత్.. ఈ తరహా సమావేశం (NSA meeting 2021) నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ ఫార్మాట్​ను అనుసరించి సమావేశానికి హాజరుకావాలని చైనా, పాకిస్థాన్​కు కూడా భారత్​ ఆహ్వానం పంపింది(India role in Afghanistan). అయితే ముందుగా ఊహించినట్టే ఈ రెండు దేశాలు భేటీలో పాల్గొనేందుకు నిరాకరించాయి. షెడ్యూల్​ సమస్య కారణంగా తాము రాలేమని చైనా సాకు చెప్పింది.

పాక్ నిర్వహించే సమావేశానికి చైనా...

అయితే, అఫ్గానిస్థాన్ అంశంపై పాకిస్థాన్ గురువారం నిర్వహించనున్న సమావేశానికి (Pakistan meeting on Afghanistan) చైనా హాజరుకానున్నట్లు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్ పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్​లో స్థిరత్వం తీసుకొచ్చేందుకు చైనా మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. అమెరికా, చైనా, రష్యా దేశాల ప్రతినిధులు పాక్ సమావేశానికి హాజరుకానున్నారు.

ఇదీ చదవండి: Afghan crisis 2021: ఆకలి మంటల్లో అఫ్గాన్‌

Last Updated : Nov 10, 2021, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.