ETV Bharat / bharat

8 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం వేటు, ఎందుకంటే - ఫేక్ యూట్యూబ్​ ఛానళ్లు బ్లాక్​

Fake youtube channels blocked 8 యూట్యూబ్​ ఛానళ్లను బ్లాక్​ చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో ఏడు భారత్‌కు చెందినవి కాగా ఒకటి పాకిస్థాన్‌కు చెందినదిగా కేంద్రం తెలిపింది. కారణం ఏంటంటే

Fake youtube channels blocked
Fake youtube channels blocked
author img

By

Published : Aug 18, 2022, 12:56 PM IST

Fake youtube channels blocked: సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లపై ఇందులో భాగంగానే కేంద్రం నిషేధం విధించగా.. తాజాగా మరో 8 యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇందులో ఏడు భారత్‌కు చెందినవి కాగా.. ఒకటి పాకిస్థాన్‌కు చెందినదిగా కేంద్రం తెలిపింది. ఈ ఛానళ్లకు మొత్తగా 85లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీటిల్లో వచ్చిన వీడియోలను 114కోట్లకు పైగా మంది వీక్షించారు. దేశ భద్రత, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు గానూ, దేశంలో కొన్ని వర్గాల మధ్య ద్వేషం పెంచేలా వీడియోలు ప్రసారం చేస్తున్నందుకు గానూ ఈ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. భారత సాయుధ బలగాలు, జమ్మూకశ్మీర్‌కు వ్యతిరేకంగా ఈ ఛానళ్లు పలు నకిలీ వార్తలను ప్రసారం చేశాయని పేర్కొంది.

తాజా నిర్ణయంతో గతేడాది నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 102 యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేసింది. ఆన్‌లైన్‌లో ప్రామాణికమైన, విశ్వసనీయమైన, సురక్షిత వార్తల ప్రసారం ఉండేలా చూసుకోవడం తమ బాధ్యత అని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని బలహీనపర్చేలా సామాజిక మాధ్యమాలు ప్రయత్నిస్తే వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇవీ చదవండి: నకిలీ ముఠా గుట్టురట్టు, ఏకంగా పోలీస్​ స్టేషన్​నే ఏర్పాటు చేసి

బిల్కిస్​ బానో ఘటనలో దోషుల విడుదలపై బాధితురాలు అసహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.