ETV Bharat / bharat

కరోనా బాధితులకు బ్లాక్ ఫంగస్​తో అంధత్వం! - కొవిడ్​ విజేతలపై బ్లాక్​ ఫంగస్​ పంజా

కొవిడ్‌-19 నుంచి కోలుకొన్న వారిని బ్లాక్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ భయపెడుతోంది. దిల్లీ, పుణె, అహ్మదాబాద్‌ల్లో ఈ తరహా కేసులను వైద్యులు గుర్తించగా.. మహారాష్ట్రలో దీని కారణంగా 8 మంది కంటి చూపు కోల్పోయారు. మరో 200 మంది చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌లో కూడా పదుల సంఖ్యలో రోగులు బ్లాక్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా చికిత్స తీసుకుంటున్నారు.

black fungus
బ్లాక్​ ఫంగస్​ పంజా
author img

By

Published : May 8, 2021, 7:50 PM IST

Updated : May 8, 2021, 10:18 PM IST

కరోనా మొదటి దశ ఉద్ధృతిలో కోలుకున్న వారిని బ్లాక్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ భయపెడుతోంది. మ్యూకోర్‌మైకోసిస్‌గా పిలిచే ఈ రుగ్మత వల్ల బాధితులు కంటి చూపు కోల్పోతున్నారు. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదమూ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో సహజంగానే ఉండే మ్యూకోర్‌ అనే ఫంగస్‌ వల్ల ఇది వస్తుంది.

మహాలో 8 మందికి అంధత్వం

మహారాష్ట్రలో మ్యూకోర్‌మైకోసిస్‌ కారణంగా 8 మంది కంటి చూపు కోల్పోయారు. మొత్తం 200 మంది ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఇది బాధితుల రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గుజరాత్‌లో మ్యూకోర్‌మైకోసిస్‌తో 50 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. మరో 60 మంది చికిత్స కోసం వేచి చూస్తున్నారు. గుజరాత్​లో ఈ వ్యాధి బారిన పడినవారిలో ఏడుగురు చూపు కోల్పోయారు.

లక్షణాలు..

ఈ ఫంగస్‌ సోకిన వారిలో కొందరు చూపు కోల్పోతున్నారు. కొంత మందిలో ముఖం వాపు, ముక్కు ఒక వైపు పూర్తిగా మూసుకుపోయినట్లు ఉండటం, కళ్ల వాపు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కీలక పరీక్షల్లో అవయవాల్లో నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తుల్లోకి ఈ ఫంగస్‌ చేరితే ఛాతీలో నొప్పి, ఊపిరి ఆడకపోవడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

ముందుగా గుర్తిస్తే మేలు..

ఈ ఫంగస్‌పై అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పలు సూచనలు చేసింది. ఈ ఫంగస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని పేర్కొంది. దీనిని మొదటే గుర్తించి యాంటీఫంగల్‌ వైద్యం అందిస్తే బాధితులను కాపాడొచ్చని తెలిపింది.

బ్లాక్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తికి 21 రోజుల పాటు ఒక రకమైన ఇంజక్షన్‌ ఇవ్వాల్సి ఉంది. రోజుకు ఇందుకోసం 9 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆస్పత్రి ఖర్చులు దీనికి అదనం.

కొవిడ్‌-19 బారినపడిన మధుమేహ వ్యాధిగ్రస్థుల్లోనే ఈ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. అయితే అది భారీగా విజృంభించడం లేదని చెప్పారు. ఆ రుగ్మతకు చికిత్స అందుబాటులో ఉందన్నారు.

"డెక్సామెథాసోన్‌, ప్రెడ్నిసోలోన్‌, మిథైల్‌ ప్రెడ్నిసోలోన్‌, డెక్సోనా వంటి ఔషధాలను కొవిడ్‌ బాధితుల్లో రోగ నిరోధక వ్యవస్థను అదుపుచేయడానికి ఉపయోగిస్తున్నారు. వీటివల్ల మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లకు ఆస్కారం ఉంది. కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ పెట్టినప్పుడు అందులో నీరు కలిగిన హుమిడిఫయర్‌ వల్ల కూడా ఇలాంటివి రావొచ్చు. రోగ నిరోధక వ్యవస్థను అదుపు చేయడానికి వాడుతున్న టొసిలిజుమాబ్‌, ఇటోలిజుమాబ్‌ల వల్ల కూడా మధుమేహ బాధితుల్లో బ్లాక్‌ ఇన్‌ఫెక్షన్‌కు ఆస్కారం ఉంది. మధుమేహం ఉన్నవారు చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి. స్టెరాయిడ్లను వారికి అనవసరంగా ఇవ్వకూడదు. కొవిడ్‌ సోకిన వెంటనే కాకుండా ఆరో రోజు తర్వాతే ఇవ్వాలి. పరిమితకాలం పాటే వాటిని కొనసాగించాలి"

- వీకే పాల్​, నీతి ఆయోగ్​ సభ్యుడు

కొవిడ్‌ తగ్గాక కూడా బాధితులు మరణించడానికి రక్తం గడ్డకట్టడం, తీవ్రస్థాయి న్యుమోనియా వంటి సెకండరీ ఇన్‌ఫెక్షన్లు కారణమని పాల్​ చెప్పారు​.

ఇదీ చూడండి: కొవిడ్‌ విజేతలపై 'బ్లాక్‌ ఫంగస్‌' పంజా..!

Last Updated : May 8, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.