ETV Bharat / bharat

''మహా' సర్కార్​ను అస్థిరపరిచేందుకు కుట్రలు' - undefined

మహారాష్ట్రలో శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు జరగుతున్నాయని శరద్​ పవార్​ అన్నారు. హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​పై మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్​బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఇవి తీవ్ర ఆరోపణలని, ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మాజీ ఐపీఎస్​ అధికారి జులియో రిబీరో సాయం తీసుకోవాలని సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు సూచిస్తానని పవార్​ చెప్పారు.

Efforts on to destabilise Shiv Sena-NCP-Congress   government in Maharashtra but will prove futile: Sharad Pawar.
'మహా' సర్కార్​ను అస్థిరపరిచేందుకు కుట్రలు: పవార్​
author img

By

Published : Mar 21, 2021, 3:15 PM IST

Updated : Mar 21, 2021, 3:27 PM IST

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్​ పరమ్​బీర్ సింగ్​​ చేసిన ఆరోపణలపై ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్ స్పందించారు. ఇవి తీవ్రమైన ఆరోపణలని, దీనిపై లోతైన దార్యప్తు జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంతో పాటు, అనిల్​ దేశ్​ముఖ్​ను పదవి నుంచి తప్పించే విషయంపై సీఎం ఉద్ధవ్​ ఠాక్రేనే నిర్ణయం తీసుకుంటారని పవార్ స్పష్టం చేశారు.

సచిన్​ వాజేను పోలీసు శాఖలోకి తిరిగి రప్పిస్తూ గతేడాది తీసుకున్న నిర్ణయంతో సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు గానీ, హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​కు గానీ ఎలాంటి సంబంధం లేదని పవార్ చెప్పారు. వాజేను తిరిగి పోలీసు శాఖలోకి తీసుకుంది పరమ్​బీర్​ సింగే అని తెలిపారు. ఆయనను కమిషనర్​ పదవి నుంచి తప్పించాకే హోంమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ(శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్ కూటమి​) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పవార్​ ఆరోపించారు. హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలు సంకీర్ణ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవని అన్నారు. ఈ విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి జులియో రిబీరో సాయం తీసుకోవాలని సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు సూచిస్తానని పవార్​ చెప్పారు.

హోంమంత్రి రాజీనామా చేయాలి..

హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ పదవిలో ఉన్నంత వరకు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని మహారాష్ట్ర ప్రతిపక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. అందుకే అనిల్ దేశ్​ముఖ్​ హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

లేఖ దుమారం..

హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ పరమ్​బీర్​ సింగ్​ ఠాక్రేకు లేఖ రాశారు. నెలకు​ రూ.100 కోట్లు సంపాదించాలని పోలీసు అధికారి సచిన్​ వాజేకు అనిల్ దేశ్​ముఖ్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. బార్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బులు వసూల్ చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఈ ఆరోపణలను మంత్రి ఖండించారు.

ఇవీ చూడండి: 'లేఖ'పై మహా​లో ప్రకంపనలు- పవార్​ కీలక భేటీ!

పరమ్​Xదేశ్​ముఖ్​- 'మహా'లో లేఖ దుమారం

Last Updated : Mar 21, 2021, 3:27 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.