ETV Bharat / bharat

వీధి జంతువులకు అన్నీతామైన.. 'స్మైల్​ టీం' - వీధి కుక్కలకు ఆహారం అందిస్తోన్న స్మైల్​ టీం

పట్టణ ప్రాంతాల్లోని వీధి జంతువులకు అన్నీ తామై అండగా ఉంటోంది కర్ణాటకకు చెందిన 'స్మైల్​ టీమ్'. కుక్కలతో పాటు ఇతర జంతువులకు నీరు, ఆహారం అందించి మానవత్వాన్ని చాటుతున్నారు టీమ్​ లోని విద్యార్థులు. తమ పాకెట్​ మనీతోనే వీధి కుక్కలకు ఆహారం అందించటంతో పాటు సామాజిక సేవ చేస్తూ.. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Efforts of 'Smile Team' towards strays laudable
వీధి జంతువులకు అన్నీతామైన.. 'స్మైల్​ టీం'
author img

By

Published : Apr 7, 2021, 6:58 PM IST

వీధి జంతువులకు అన్నీతామైన.. 'స్మైల్​ టీం'

కర్ణాటక హుబ్లీలోని 'స్మైల్​ టీం'.. వీధి జంతువులపాలిట ఆపద్బాంధవుగా నిలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రోడ్డు పక్కన తలదాచుకునే శునకాలు, ఇతర జంతువులకు నీరు, ఆహారం అందించి తమ దాతృత్వాన్ని చాటుతున్నారు బృందంలోని విద్యార్థులు. తమ పాకెట్ మనీతోనే.. వీధి జంతువుల ఆలనాపాలనా చూస్తూ.. తమవంతు సామాజిక సేవ చేస్తున్నారు.

స్థానికుల అండతో..

తమ ప్రయత్నాన్ని విజయంవంతం చేసేందుకు స్థానికుల సహాయం తీసుకుంటున్నారు టీంలోని విద్యార్థులు. దీంతో వీధి జంతువులు నివాసం ఉండే ప్రాంతాల్లో నీరు, బిస్కెట్లు, ఆహారాన్ని ఉంచుతున్నారు. శునక ప్రేమికులకు ఈ విధానాన్ని వివరించి.. వారి సహకారం కోరారు విద్యార్థులు.

" నాలుగు వీధి కుక్కలు డ్రైనేజీ నీటిని తాగటం నేను చూశాను. నాకు ఆరోజే శునకాలకు, ఇతర వీధి జంతువులకు నీరు, ఆహారం అందించాలన్న ఆలోచన వచ్చింది. ప్రపంచ నీటి దినోత్సవం రోజున మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటి నుంచి వీధి జంతువులు నివాసం ఉండే ప్రాంతాల్లో ఆహారాన్ని ఉంచుతున్నాం. మా శ్రమకు స్థానికుల ప్రోత్సాహం తోడైంది."

-- సునీల్, స్మైల్​ టీం సభ్యులు

తమ పాకెట్ మనీని ఖర్చుచేసి విద్యార్థులు.. ఇలాంటి సేవ చేయటంపై హుబ్లీ ప్రజలు వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇదీ చదవండి : రైల్వే గోడలపై మేవాడ్​ ఘన చరిత్ర.. చూస్తే వావ్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.