ETV Bharat / bharat

మహారాష్ట్ర సీఎం బావమరిది ఆఫీసులపై ఈడీ దాడులు

author img

By

Published : Mar 22, 2022, 9:45 PM IST

ED Raid on Patankar: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే బావమరిది శ్రీధర్​ మాధవ్​ కార్యాలయాలపై ఈడీ దాడులు చేపట్టింది. రూ. 6.45 కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్​ చేసింది. ఈడీ కేవలం భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే పనిచేస్తోందంటూ శివసేన నేత సంజయ్​ రౌత్​ ఆరోపించారు.

ed
ఈడీ

ED Raid on Patankar: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ మంగళవారం దాడులు చేసింది. మనీలాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రైడ్​ నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరీ ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్​ ఫ్లాట్లను అటాచ్​ చేసింది. శ్రీసాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్​ లిమిటెడ్​కు చెందిన ఈ ఆస్తులు ఠాక్రే బావమరిది (సతీమణి రష్మీ ఠాక్రే సోదరుడు).. శ్రీధర్​ మాధవ్​ పటాంకర్​ పేరు మీద ఉన్నాయి. మొత్తం రూ.6.45 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్​ చేసింది.

పుష్పక్​గ్రూప్​ మనీలాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా సంబంధిత సంస్థ.. శ్రీధర్​ మాధవ్​కు చెందిన శ్రీసాయిబాబా గృహనిర్మితికి నగదును బదిలీ చేసినట్లు తమకు సమాచారం అందిందని ఈడీ వెల్లడించింది. పుష్పక్​ గ్రూప్​ కేసు నిందితుడు మహేశ్​ పటేల్​ మరో నిందితుడు నందకిశోర్​ చతుర్వేది సాయంతో శ్రీధర్​ మాధవ్​ సంస్థలోకి నగదును బదిలీ చేసినట్లు తెలిపింది. దాదాపు రూ.50 కోట్లను శ్రీధర్​ మాధవ్​ సంస్థకు చెందిన రియల్​ ఎస్టేట్​ ప్రాజెక్టులలో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపింది.

'ఆ రాష్ట్రాల్లోనే ఈడీ పనిచేస్తోంది'

సీఎం ఠాక్రే బంధువు శ్రీధర్​ మాధవ్​ ఆస్తులను ఈడీ అటాచ్​ చేయడంపై శివసేన నేత సంజయ్​ రౌత్​ స్పందించారు.

"భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే ఈడీ చర్యలు చేపడుతోంది. గుజరాత్​ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాలను మూసేసినట్టు ఉంది. అంతా మహారాష్ట్రలోనే జరుగుతున్నట్లు ఉంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్​ బెనర్జీని కూడా ఇదే విధంగా వేధించారు. కానీ అటు బెంగాల్​, ఇటు మహారాష్ట్ర రెండూ ఈ చర్యలకు లొంగిపోవు."

-సంజయ్​ రౌత్​, శివసేన ఎంపీ

అప్పుడు ఈడీ అంటే ఎవరికీ తెలియదు..

కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్. "కొన్నేళ్ల క్రితం అసలు ప్రజలకు ఈడీ అంటే ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఆ దర్యాప్తు సంస్థ అధికార దుర్వినియోగంతో గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా తెలుస్తోంది." అని పవార్​ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి : '5 కోట్లు పెట్టుబడితో రూ.500 కోట్లు!'.. ఇరీడియం పేరుతో నటుడికి టోకరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.