ED Notices to Chikoti Praveen: క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం అనగా ఈనెల 15న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై గతంలో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు చీకోటిని ప్రశ్నించిన ఈడీ అధికారులు.. తాజాగా థాయ్‌లాండ్ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చారు. చీకోటితో పాటు ఈ వ్యవహారంతో సంబంధముందని భావిస్తున్న చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. ఈడీ నోటీసుల నేపథ్యంలో సంపత్ నేడు విచారణకు హాజరయ్యారు. మిగతా ముగ్గురు హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసులలో పేర్కొంది. చీకోటి ఇప్పటికీ విదేశాల్లోనే ఉన్నట్టు సమాచారం. ఫెమా నిబంధనలతో పాటు మనీలాండరింగ్ అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీకోటి బృందాన్ని ప్రశ్నించనుంది.
ఇవీ చదవండి: