ETV Bharat / bharat

'ఈడీ అధికారులు భాజపాకు ఏటీఎంలా మారారు' - సంజర్ రౌత్ వార్తలు

ED has become ATM of BJP: కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఈడీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సంస్థకు చెందిన కొందరు అధికారులు భాజపాకు ఏటీఎంలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే ఆ అధికారులు జైలుకు వెళ్తారని హెచ్చరించారు.

ED has become ATM of BJP
ED has become ATM of BJP
author img

By

Published : Mar 8, 2022, 10:06 PM IST

ED ATM of BJP: ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ సంస్థకు చెందిన అధికారులు కొందరు భాజపాకు ఏటీఎంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఈడీ అధికారుల అవినీతిపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారని.. త్వరలోనే కొందరు జైలుకు వెళ్తారని అన్నారు.

Enforcement Directorate Sanjay Raut

ఓ ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన రౌత్.. ముంబయి పోలీసులు అవినీతి, దోపిడీ రాకెట్​పై వేర్వేరు కేసులు నమోదు చేశారని తెలిపారు. పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ వధ్వాన్​కు భాజపా నేత కృతి సోమైయాకు చెందిన వ్యాపారాలకు మధ్య సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

Raut on ED BJP

"ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఏ కంపెనీపై రైడ్లు చేసినా.. డబ్బును మాత్రం జితేంద్ర నవ్లానీకి చెందిన కంపెనీకి బదిలీ చేస్తోంది. ఆ కంపెనీలకు ఆఫీసులు ఉండవు, సిబ్బంది ఉండరు. నవ్లానీకి చాలా మంది భాజపా నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈడీ, ఆ శాఖకు చెందిన కొందరు అధికారులు భాజపాకు ఏటీఎంలా మారారు. ఓ మాజీ ఈడీ అధికారి భాజపా టికెట్​పై ఎన్నికల్లోనూ పోటీ చేశారు. 50 మంది పార్టీ అభ్యర్థుల ఖర్చులను భరించారు. ఈ వివరాలన్నింటినీ పీఎంఓ(ప్రధాని కార్యాలయం)కు పంపించా. నా మాటలు గుర్తుపెట్టుకోండి. కొందరు ఈడీ అధికారులు తప్పక జైలుకు వెళ్తారు."

-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ

అయితే, ఎన్నికల్లో పోటీ చేసిన ఈడీ అధికారి పేరు గానీ, ఇతర అధికారుల వివరాలు గానీ రౌత్ వెల్లడించలేదు. తర్వాతి ప్రెస్ కాన్ఫరెన్స్​లో వారి పేర్లను చెప్తానని అన్నారు.

అంతకుముందు, మహారాష్ట్ర మంత్రి, ఆదిత్య ఠాక్రే ఇంటిపై ఐటీ శాఖ సోదాలు జరిపింది. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సోదాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

దీనిపైనా రౌత్ మండిపడ్డారు. బంగాల్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలనే కేంద్ర ఏజెన్సీలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయని ప్రశ్నించారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ కుట్రలు పన్నుతోందని భాజపాపై ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వానికి చెందిన 14 మందిని భాజపా టార్గెట్ చేసిందని అన్నారు. ఈ చర్యలన్నీ బెడిసికొడతాయని హెచ్చరించారు.

ఇదీ చదవండి: కేంద్రం గుడ్​న్యూస్.. విమాన సర్వీసులపై నిషేధం ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.