ETV Bharat / bharat

మమత భద్రతా బృందంపై ఈసీ చర్యలు! - కేంద్ర ఎన్నికల సంఘం

మమతా బెనర్జీ కాలికి గాయం వ్యవహారంలో ఆమె భద్రతా బృందంలోని పోలీసు అధికారులపై ఈసీ చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల పరిశీలకులు ఇచ్చే నివేదికల కోసం వేచి చూస్తున్నట్లు సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

ECI might punish police personnel
బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
author img

By

Published : Mar 12, 2021, 6:10 PM IST

Updated : Mar 12, 2021, 6:34 PM IST

నందిగ్రామ్​ ప్రచారంలో బంగాల్​ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైన నేపథ్యంలో ఆమె భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉందని సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. అయితే.. పోలీసులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు ఇద్దరు ఇవ్వాల్సిన నివేదికల కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు.

" ముఖ్యమంత్రి భద్రతా బృందం విఫలమవటం వల్లే ఈ సంఘటన జరిగింది. సీఎం చుట్టూ భద్రతా సర్కిల్​లోకి ఎవరూ వెళ్లకూడదు. ఈసీఐ స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్​లో పలువురు సీఎం వాహనానికి అతి సమీపంలోకి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. అలా జరిగి ఉండకూడదు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన భద్రతా ఉల్లంఘన. చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల అధికారుల నివేదికల కోసం వేచి చూస్తున్నాం. "

- ఎన్నికల సంఘం సీనియర్​ అధికారి

వీడియోలో మమతపై దాడి జరిగినట్లు స్పష్టంగా కనిపించలేదని, నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు ఆ అధికారి.

దాడి వెనక ఉన్నదెవరో ఈసీ కనిపెట్టాలి: టీఎంసీ

నందిగ్రామ్​లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జరిగిన దాడి వెనక ఉన్న వారెవరో ఎన్నికల సంఘం తేల్చాలని డిమాండ్​ చేశారు టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ​. మమతకు ఉన్న ప్రజాదరణపై భయంతోనే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు నడ్డాకు.. మమత ఆరోగ్యం గురించి తెలుసుకోవాలన్న కనీస ఆలోచన లేదని విమర్శించారు.

టీఎంసీ నిశ్శబ్ద నిరసనలు..

మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటనను నిరసిస్తూ తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిశ్శబ్ద ర్యాలీలు చేపట్టాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్​ నేతలు ఈ నిరసనలకు నేతృత్వం వహించారు. నల్ల వస్త్రాలను నోటికి కట్టుకుని, ధిక్కారం అని రాసి ఉన్న ప్లకార్డులను మెడలో వేసుకుని ర్యాలీల్లో పాల్గొన్నారు.

హైకోర్టులో పిల్​..

మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ కోల్​కతా హైకోర్టును ఆశ్రయించారు టీఎంసీ నేత సుల్జిత్​ సాహా. ఈ వ్యాజ్యంపై వచ్చే శుక్రవారం విచారణ జరపనుంది హైకోర్టు.

ఇదీ చూడండి: ఆర్ఎస్​ఎస్​, భాజపా మధ్య దూరం పెరిగిందా?

Last Updated : Mar 12, 2021, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.