ETV Bharat / bharat

ప్రచారంలో కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు - central election commission latest news

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్​ నిబంధనల అమలు తీరుపై అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

election commission of india
బంగాల్​ ఎన్నికల ప్రచారంపై సీఈసీ సమీక్ష
author img

By

Published : Apr 24, 2021, 3:13 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్​ నిబంధనల అమలు తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సమీక్ష నిర్వహించింది. బంగాల్​లో వచ్చే వారంలో మిగతా రెండు విడతల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అధికారులతో ప్రధాన ఎన్నికల కమిషనర్​ సుశీల్​ చంద్ర, ఎన్నికల కమిషనర్​ రాజీవ్​ కుమార్​ శనివారం సమావేశమయ్యారు.

బంగాల్​ ఎన్నికల ప్రధాన కార్యదర్శి, పోలీస్​ చీఫ్​, ఆరోగ్య కార్యదర్శి, కోల్​కతా పోలీస్​ కమిషనర్​.. ఈ సమావేశంలో పాల్గొన్నట్లు ఈసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించేవారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఈసీ ఆదేశించినట్లు చెప్పారు.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కొవిడ్​ నిబంధనలను అమలు చేయటంలో ఈసీ తీరుపై కోల్​కతా హైకోర్టు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. సీఈసీ సమీక్షా సమావేశం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు.. బంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం ఇటీవల ఆంక్షలు విధించింది. బహిరంగ సభలకు 500 మందిని మాత్రమే అనుమతించాలని సూచించింది. పాదయాత్రలు, రోడ్‌ షోలపై నిషేధం విధించింది.

ఇదీ చూడండి: పోలీస్ స్టేషన్​లోనే కానిస్టేబుల్ 'హల్దీ' వేడుక

ఇదీ చూడండి: బంగాల్​: ఎనిమిదో దశలో 23% మందికి నేరచరిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.