ETV Bharat / bharat

ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

author img

By

Published : Feb 27, 2021, 9:56 PM IST

అసోం శాసనసభ ఎన్నికల తేదీలు విడుదలైన నేపథ్యంలో.. ఆ రాాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐపీఎస్ అధికారుల బదిలీని ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

EC stops transfer of IPS, APS officers ordered by Assam govt
ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

అసోం శాసనసభ ఎన్నికల తేదీలు ఖరారైన వేళ.. ఎన్నికల కమిషన్​ చురుగ్గా స్పందిస్తోంది. అసోంలో 12 మంది ఐపీఎస్ అధికారులు సహా.. అసోం పోలీసుశాఖకు చెందిన ఆరుగురు అధికారులను(ఏపీఎస్​) బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఈసీ​ నిలిపేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈ బదిలీలు చేపట్టకూడదని ఆదేశించింది.

అసోం సహా.. 3 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్​ను ప్రకటించిన నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని అసోం ఎన్నికల ప్రధాన అధికారి నితిన్ ఖాడే శనివారం తెలిపారు. ఈ రాష్ట్రంలో మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: అసోం ఎన్నికల్లో పోటీకి ఆర్జేడీ సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.