ETV Bharat / bharat

'దాడి కాదు... ప్రమాదం వల్లే మమతకు గాయం!'

author img

By

Published : Mar 14, 2021, 2:15 PM IST

Updated : Mar 14, 2021, 2:45 PM IST

మమతా బెనర్జీపై దాడి జరిగిందన్న వాదనల్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఎన్నికల పరిశీలకులు, బంగాల్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈమేరకు స్పష్టం చేసింది.

mamata
మమతపై దాడి జరగలేదు: ఈసీ వర్గాలు

బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయం అయ్యేందుకు దాడి కారణం కాదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధరించినట్లు తెలిసింది. ఎన్నికల పరిశీలకులు, బంగాల్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. భద్రతా వైఫల్యాల వల్లే ఈ ఘటన జరిగినట్లు ఈసీ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ విషయంపై త్వరలో ఈసీ పలు ఆదేశాలు జారీ చేసే అవకాశముందని ఆయా వర్గాలు వెల్లడించాయి. స్టార్​ క్యాంపెయినర్​ అయినప్పటికీ.. మమత బులెట్​ ప్రూఫ్​ వాహనం వినియోగించకపోవడం భద్రతాపరమైన వైఫల్యమేనని ఈసీ భావిస్తున్నట్టు పేర్కొన్నాయి.

నందిగ్రామ్​లో..

ఈ నెల 10న నందిగ్రామ్​లో నామినేషన్​ వేశారు మమత. ఆ రోజు సాయంత్రం ఆమె కాలికి గాయమైంది. తనపై దాడి జరిగిందంటూ దీదీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. నందిగ్రామ్​ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని కోల్​కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల అనంతరం డిశ్చార్జ్​ అయ్యారు.

ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం చెలరేగింది. ఎన్నికల వేళ.. మమత కావాలనే ఇలా చేస్తున్నారని.. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని భాజపా సహా విపక్షాలు డిమాండ్​ చేశాయి.

ఇదీ చూడండి:- చక్రాల కుర్చీపైనే మమతా బెనర్జీ ర్యాలీ

Last Updated : Mar 14, 2021, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.