బంగాల్ ఆరో దశ ఎన్నికల ముందు అధికార టీఎంసీ, భాజపాలకు ఈసీ షాకిచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు గానూ తృణమూల్ కాంగ్రెస్ నేత సుజాతా మొండల్ ఖాన్, భాజపా నేత సయంతన్ బసులపై ఈసీ చర్యలు తీసుకుంది.
ఇరువురూ 24 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది ఈసీ. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ మొండల్ ఖాన్‌పై; కూచ్‌బిహార్ కాల్పులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు సయంతన్ బసుపై ఈ మేరకు చర్యలు చేపట్టింది ఈసీ.
ఇదీ చదవండి: 'నా భర్తకు ఓటేయొద్దు.. అతని క్యారెక్టర్ మంచిది కాదు'