ETV Bharat / bharat

అపార్ట్​మెంట్​లో అర్ధరాత్రి డ్రగ్స్​ పార్టీ.. విదేశీ యువతుల అరెస్ట్! - కర్ణాటక

అర్ధరాత్రి డ్రగ్స్​ పార్టీపై దాడులు చేసిన పోలీసులు విదేశీ యువతులతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న సంఘటన బెంగళూరులో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ పార్టీ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Drugs Party in Bengaluru
బెంగళూరు డ్రగ్స్​ పార్టీ
author img

By

Published : Jun 19, 2022, 10:35 AM IST

ఓ అపార్ట్​మెంట్​లో నిర్వహిస్తున్న డ్రగ్స్​ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. విదేశీ యువతులతో పాటు ఓ యువకుడు, యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెన్నూర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఇదీ జరిగింది: నగర శివారు హెన్నూర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో శుక్రవారం అర్ధరాత్రి డ్రగ్స్​ పార్టీ జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న పలువురు విదేశీ యువతులు సహా ఇతర రాష్ట్రాల యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని వైద్య పరీక్షల కోసం పంపించామన్నారు. తదుపరి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: హాస్టల్​ విద్యార్థినులపై.. స్కూల్​ ప్రిన్సిపాల్​ అఘాయిత్యం

పరువు హత్య కలకలం.. సొంత చెల్లిని కత్తులతో పొడిచి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.