కేరళ నుంచి తరలిస్తున్న 40 గ్రాముల డ్రగ్స్‌ను (drugs seized in bengaluru) బెంగళూరు ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక నిందితున్ని అరెస్టు చేశారు.
మరో ఘటనలో.. చూయింగ్ గమ్, చాక్లెట్ కవర్లలో కేరళకు అక్రమంగా డ్రగ్స్‌ను తరలిస్తున్నారనే సమాచారాన్ని తిరువనంతపురం ఎన్సీబీ అధికారులకు అందించారు. ఈ క్రమంలో దాడులు జరిపిన కేరళ అధికారులు.. లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
వెల్లూరు, ముంబయిల్లోనూ..
తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న 212 కేజీల గంజాయిని చెన్నై ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కొబ్బరి మొక్కల కోసం వాడే మట్టి కింద గంజాయిని దాచి ఉంచినట్లు వెల్లడించారు.
ముంబయిలో రూ.5కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నైజీరియాకు చెందిన డ్రగ్ ఏజెంట్‌ను అరెస్టు చేశారు. చెంబూర్ ప్రాంతంలో భారీగా డ్రగ్స్ నిల్వ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో 200 గ్రాముల కొకైన్, 5 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:చిన్నారిని కిడ్నాప్ చేసి.. నోట్లో తుపాకీ పెట్టి..!