ETV Bharat / bharat

డీఆర్​డీఓ కొవిడ్​ ఔషధానికి డీసీజీఐ అనుమతి

author img

By

Published : May 8, 2021, 3:11 PM IST

Updated : May 8, 2021, 3:16 PM IST

కరోనాపై పోరుకు కొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ ఔషధం పొడి రూపంలో ఉండి, సాచెట్‌ల‌లో లభిస్తుంది. దీనిని నీళ్లలో క‌లుపుకొని తాగితే.. వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్​డీఓ తెలిపింది.

DRDO
డీఆర్​డీఓ

క‌రోనాపై పోరులో మ‌రో కీల‌క అస్త్రం వైద్యులకు అందుబాటులోకి రానుంది. రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిపై ఇది బాగా పని చేస్తోంది. కరోనా రోగులకు చికిత్స చేస్తూ అదనంగా ఈ ఔషధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉందని డీఆర్​డీఓ.. ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు క్లినికల్‌ ట్రయల్స్‌లో రుజువైనట్లు తెలిపింది. ఈ ఔషధం పొడి రూపంలో ఉండి, సాచెట్‌ల‌లో వ‌స్తుంది. దీనిని నీళ్లలో క‌లుపుకొని తాగితే చాలు. ఇది వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్​డీఓ తెలిపింది.

ఈ ఔషధం జెన‌రిక్ మాలిక్యూల్‌, గ్లూకోజ్ అన‌లాగ్ కావ‌డం వ‌ల్ల ఉత్పత్తి చాలా సులువ‌ని, పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటుంద‌ని డీఆర్​డీఓ వెల్లడించింది. ఇది వాడిన కరోనా రోగులు ఇతర కరోనా రోగుల కంటే వేగంగా కోలుకున్నట్లు తెలిపింది. డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేట‌రీస్‌తో కలిసి డీఆర్​డీఓ ల్యాబ్‌...ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిసిన్ అండ్ అలైడ్‌ సైన్సెస్ దీన్ని అభివృద్ధి చేసింది.

వైరస్​పై సమర్థవంతంగా..

ఆస్పత్రిలో చేరిన కరోనా రోగులు వేగంగా కోలుకునేందుకు , కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గించేందుకు ఈ ఔషధం దోహదం చేసినట్లు డీఆర్​డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. 2020 ఏప్రిల్‌లో కరోనా తొలిదశ ఉద్ధృతి సమయంలో 2-డీజీ ఔషధంపై ప్రయోగాలు నిర్వహించారు. ఇది కొవిడ్‌పై సమర్థవంతంగా పని చేస్తోందని, వైరస్‌ ఉద్ధృతిని అడ్డుకుంటోందని కనిపెట్టారు. ఆ ఫలితాల ఆధారంగా 2-డీజీ ఔషధం రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు గత ఏడాది మేలో డీసీజీఐ అనుమతినిచ్చింది.

మే నుంచి అక్టోబర్‌ వరకు దేశ వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 110 మంది కరోనా రోగులపై క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించారు. 2-డీజీ ఔషధం సురక్షితమైనదని, రోగి త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడుతోందని క్లినికల్ ట్రయల్స్‌లో రుజువైంది.

ఇదీ చదవండి : త్వరలో అందుబాటులోకి జైడస్​ టీకా!

Last Updated : May 8, 2021, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.