Beating Retreat Ceremony: దిల్లీలో బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో త్రివిధ దళాలు సంగీత బ్యాండ్లు ప్రదర్శన ఇచ్చాయి. దశాబ్దాల నుంచి సంప్రదాయంగా వస్తున్న ఈ బీటీంగ్ రీట్రీట్ కార్యక్రమంలో ఈ సారి డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.
1000 డ్రోన్లలతో..
ఈ బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని ఈ ఏడాది సాంకేతికతతో మరింత ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావించింది. అందుకే 1000 డ్రోన్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 10 నిమిషాల పాటు సాగిన ఈ షోలో 75 ఏళ్ల స్వతంత్ర భారతాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శన నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఈ ప్రొగ్రామ్‌ను నిర్వహించింది కేంద్రం.
దీంతో పాటు నార్త్.. సౌత్ బ్లాక్స్ వద్ద 3-4 నిమిషాల పాటు కళ్లు చెదిరే లేజర్ షో నిర్వహించింది. రాజ్‌పథ్ రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలుగులీనింది.
ఆ కీర్తన తొలగింపు..
ఈ ఏడాది త్రివిధ దళాలు తమ బ్యాండ్ల ప్రదర్శనలో 'కేరళ', 'హింద్ కీ సేనా', 'యే మేరే వాతన్ కే లోగోన్' వంటి కీర్తలను చేర్చగా.. జాతిపిత మహాత్మా గాంధీకి ఇష్టమైన క్రైస్తవ కీర్తన 'అబైడ్ విత్ మీ'ను తొలగించారు. ప్రముఖ గీతం 'సారే జహాన్ సే అచ్చా'తో కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమం కోసం విజయ్ చౌక్‌లో ఆంక్షలను అమలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి : 'పెగసస్‌పై సుప్రీం కమిటీ దర్యాప్తు చేస్తోంది.. నివేదిక రావాలి'