ETV Bharat / bharat

ఛాయ్​ కోసం ట్రైన్​నే ఆపేసిన డ్రైవర్​ - బిహర్ న్యూస్​

Driver Stopped Train for Tea in Siwan: ఛాయ్​ భారతీయుల జీవితాల్లో భాగమైపోయింది. అలాంటి ఛాయ్​ కోసం బిహర్​లోని ఓ డ్రైవర్ ఏకంగా ట్రైన్​నే ఆపేశాడు​. టీ​ వచ్చాకే ట్రైన్​ను ముందుకు తీశాడు. ఈ దృశ్యాన్ని చూసిన వ్యక్తి ఫొటోలు తీయడం వల్ల సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

Driver Stopped Train for Tea in Siwan
Driver Stopped Train for Tea in Siwan
author img

By

Published : Apr 24, 2022, 11:26 AM IST

Updated : Apr 24, 2022, 10:14 PM IST

Driver Stopped Train for Tea in Siwan: సాధారణంగా ఛాయ్​ కోసం బస్సును ఆపడం చూసుంటాం. అదే ఛాయ్ కోసం ట్రైన్​ ఆగడం ఎప్పుడైనా చూశారా? బిహర్​లోని సివాన్​లో ఓ ట్రైన్​ డ్రైవర్​ టీ​ కోసం ఏకంగా ట్రైన్​నే ఆపేశాడు. ట్రైన్​ డ్రైవర్​కు తల నొప్పి వచ్చిందేమో.. మార్గమధ్యంలోని క్రాసింగ్​ వద్దే ఆపేశాడు. రైలులోని ప్రయాణికులతో పాటు రోడ్డుపై ఉన్న వాహనదారులు కూడా అవస్థలు పడ్డారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను ఫొటో తీసి సోషల్​ మీడియాలో పెట్టడం వల్ల వైరల్​గా మారింది.

Driver Stopped Train for Tea in Siwan
ఛాయ్​ కోసం ట్రైన్​ను ఆపిన డ్రైవర్​

ఇదీ జరిగింది: ఝాన్సీ నుంచి గ్వాలియర్​ వెళ్తున్న మెయిల్​ ఎక్స్​ప్రెస్​ ఉదయం 5: 27కు ​ సివాన్​ స్టేషన్​ వద్దకు చేరుకుంది. ఇంతలో ఛాయ్​ కోసం దిగిన గార్డు ఎక్కలేదని తెలుసుకున్న డ్రైవర్​.. బయలుదేరాల్సిన సమయం కావడం వల్ల క్రాసింగ్​ వద్దకు తీసుకెళ్లి నిలిపివేశాడు. గార్డు ఛాయ్​ తీసుకువచ్చి.. డ్రైవర్​కు ఇచ్చాకే ట్రైన్​ బయలుదేరింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై విచారణ చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం రాజస్థాన్​లో కచోడీ కోసం ట్రైన్​ ఆపాడు మరో డ్రైవర్​. మన దేశంలో ఇలా ఉంటే మరోవైపు జపాన్​లో మాత్రం ట్రైన్​ ఒక్క నిమిషం ఆలస్యం అయినందుకు డ్రైవర్ జీతాన్ని కట్​ చేశారు అధికారులు. హిరోఫుమీ వాడా(59).. పశ్చిమ జపాన్ రైల్వేలో డ్రైవర్. 2021 జూన్​ 18న ఒకాయమా స్టేషన్​లో అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రయాణికులంతా దిగేశాక ఖాళీగా ఉన్న రైలును ప్లాట్​ఫాం నుంచి డిపోలోకి తీసుకెళ్లడం అతడి విధి. అయితే.. పొరపాటున హిరోఫుమీ ఒక ప్లాట్​ఫాంకు బదులు మరొకదానికి వెళ్లాడు. వెంటనే తిరిగి వచ్చి రైలును డిపోకు తీసుకెళ్లాడు. అయితే.. అప్పటికే నిమిషం ఆలస్యమైంది. దీనిని తీవ్రంగా పరిగణించింది పశ్చిమ జపాన్ రైల్వే యాజమాన్యం. హిరోఫుమీ నిమిషం పనిచేయలేదంటూ అతడి జీతంలో 56 యెన్(సుమారు రూ.34) కోత పెట్టింది. దీనిపై న్యాయపోరాటం చేసి, చివరకు గెలిచాడు వాడా. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

Last Updated : Apr 24, 2022, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.