ETV Bharat / bharat

Dream11 One Crore Winner : బంగ్లా-ఇంగ్లండ్​ మ్యాచ్​లో బెట్టింగ్​.. ఎస్​ఐ​కు రూ.1.5 కోట్ల జాక్​పాట్​.. సో లక్కీ గురూ! - డ్రీమ్​లో కోటి రూపాయల విజేత

Dream11 One Crore Winner : డ్రీమ్​​ 11లో పందెం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు మహారాష్ట్రకు చెందిన ఓ పోలీస్​ సబ్​ ఇన్​స్పెక్టర్​. ఆయన ఎంపిక చేసుకున్న జట్టు అగ్రస్థానంలో నిలవడం వల్ల రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు.

dream11 one crore winner
dream11 one crore winner
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 10:17 PM IST

Dream11 One Crore Winner : డ్రీమ్ 11.. చాలా మందికి తెలిసిన పేరే. ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. తమ అంచనాల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తొలిస్థానంలో నిలిచి జాక్​పాట్ కొట్టాలని భావిస్తుంటారు. కానీ, అతికొద్ది మందికే అలాంటి అవకాశం లభిస్తుంటుంది. ఈ కోవకు చెందిన ఓ సబ్​ ఇన్​స్పెక్టర్​​ రాత్రికిరాత్రే రూ.కోటికిపైగా కొల్లగొట్టారు.

dream11 one crore winner
ఎస్సై సోమనాథ్ జెండే

రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిన ఎస్సై..
1 Crore Winner In Dream11 : మహారాష్ట్రలోని పింప్రి చించ్​వాడ్​ పోలీస్​ కమిషనరేట్​కు చెందిన సోమ్​నాథ్​ జెండే.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యారు. డ్రీమ్ ​11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. మూడు నెలలుగా సోమ్​నాథ్​ డ్రీమ్​ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారత్​ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్​లో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లాండ్​- బంగ్లాదేశ్ మ్యాచ్​లో సోమ్​నాథ్​ బెట్టింగ్​ వేశారు. మ్యాచ్​లో ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే టీమ్​ను ఎంపిక చేసుకున్న ఆయన.. ఫాంటసీ గేమ్​లో అగ్రస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

dream11 one crore winner
డ్రీమ్ 11లో రూ.కోటిన్నర గెలుచుకున్న సోమనాథ్ జెండే

"కొన్ని నెలలుగా డ్రీమ్​ 11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. ఇంతవరకు సక్సెస్​ కాలేకపోయాను. మంగళవారం కూడా డ్రీమ్ ​11 టీమ్​ను ఎంచుకున్నాను. ఆ తర్వాత నా టీమ్​లో టాప్​లోకి వచ్చింది. వెంటనే రూ.1.5 కోట్ల గెలుచుకున్నట్లు మెసేజ్​ వచ్చింది. మొదట దానిని నమ్మలేదు. తర్వాత నమ్మాను. మొత్తానికి చాలా సంతోషంగా ఉంది" అని సోమ్​నాథ్ జెండే తెలిపారు.

రూ.2 కోట్లు గెలుచుకున్న యువకుడు..
కొద్దిరోజుల క్రితం.. జమ్ముకశ్మీర్​కు చెందిన ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ యాప్​ డ్రీమ్​ 11లో పందెం వేసి 2 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. కశ్మీర్​లోని బిజబిహారకు చెందిన వసీం రాజా గత రెండేళ్లుగా డ్రీమ్​11 లో క్రికెట్​, హాకీ, ఫుట్​బాల్​, కబడ్డీ, బాస్కెట్​బాల్​ క్రీడల్లో బెట్టింగ్​ వేసేవాడు. ఎప్పటిలాగే బెట్టింగ్​ వేయగా అదృష్టం వరించి రెండు కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

డ్రీమ్ 11లో ఆటో డ్రైవర్​కు జాక్​పాట్​.. రూ.39తో కోటి సొంతం.. బ్యాంక్ అకౌంట్ లేక..

నిన్నటి వరకు అతి సామాన్యుడు​.. డ్రీమ్​11తో ఒక్కసారిగా లైఫ్​ టర్న్.. రూ.కోటి జాక్​పాట్​!

రూ.49తో డ్రీమ్​11లో బెట్టింగ్.. గిరిజనుడికి కోటి జాక్​పాట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.