ETV Bharat / bharat

డీఆర్​డీఓ ల్యాబ్​ల మధ్య 'క్వాంటమ్' కమ్యూనికేషన్ - Defence Research and Development Organisation

క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ సాంకేతికత ఆధారం చేసుకొని రెండు ల్యాబ్​ల మధ్య సురక్షితమైన సమాచార వ్యవస్థను నెలకొల్పింది డీఆర్​డీఓ. హైదరాబాద్​లోని డీఆర్​డీఎల్, ఆర్​సీఐని అనుసంధానం చేసింది.

DRDO successfully demonstrates quantum communication between two labs
డీఆర్​డీఓ క్వాంటమ్ సాంకేతికతతో కమ్యునికేషన్
author img

By

Published : Dec 9, 2020, 7:39 PM IST

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ సరికొత్త సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్(క్యూకేడీ) సాంకేతికత ఉపయోగించి రెండు ల్యాబ్​ల మధ్య కమ్యూనికేషన్​ నెలకొల్పింది. హైదరాబాద్​లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి లేబొరేటరీ(డీఆర్​డీఎల్), ద రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్(ఆర్​సీఐ)ను అనుసంధానం చేసింది.

"రక్షణ, వ్యూహాత్మక సంస్థలకు సురక్షితమైన సమాచార మార్పిడి అత్యంత కీలకం. ఈ విషయంలో ఎన్​క్రిప్షన్ కీలను ఎప్పటికప్పుడు మార్చడం చాలా అవసరం. ఎన్​క్రిప్షన్ కీలను సురక్షితంగా పంపించుకొనేందుకు క్వాంటమ్ ఆధారిత కమ్యూనికేషన్ ఉపయోగపడుతుంది. టైమ్-బిన్ క్యూకేడీను ఉపయోగించి వాస్తవ పరిస్థితుల్లో క్వాంటమ్ కమ్యూనికేషన్​ను పరీక్షించాం. సమాచారాన్ని మూడో వ్యక్తి గ్రహిస్తే గుర్తించే విధానాన్ని ప్రదర్శించాం."

-డీఆర్​డీఓ ప్రకటన

రెండు ల్యాబ్​ల మధ్య క్యూకేడీ ఆధారిత సమాచార మార్పిడిని విజయవంతంగా నెలకొల్పినందుకు డీఆర్​డీఓను రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ అభినందించారు.

ఇదీ చదవండి: కొత్త పార్లమెంట్ భవనానికి గురువారం భూమిపూజ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.