DRDO Jobs Notification 2023 : బీటెక్ పూర్తి చేసి గేట్‌లో మంచి స్కోరు సాధించి సైంటిస్ట్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. మంచి జీతంతో కూడని సైంటిస్ట్ 'బి' ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ). అర్హత (DRDO Scientist B Eligibility) ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
మొత్తం ఖాళీలు..
- 204 సైంటిస్ట్ 'బి' పోస్టులు
విభాగాల వారీగా..
- డీఆర్‌డీఓ- 181
- ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఏడీఏ)- 6
- కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజినీరింగ్(సీఎంఈ)- 6
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్‌టీ)- 11
వయో పరిమితి..
- ఎస్సీ, ఎస్టీలు- 40 ఏళ్లు
- ఓబీసీ-నాన్ క్రిమీలేయర్- 28 ఏళ్లు
- అన్‌రిజర్వుడ్/ఈడబ్ల్యూఎస్- 35 ఏళ్లు మించరాదు.
అప్లికేషన్ ఫీజు..
- ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ అభ్యర్థులు- రూ.100/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
దరఖాస్తు చివరితేదీ..
- 2023 ఆగస్టు 31
జీతభత్యాలు..
DRDO Scientist B Salary : డీఆర్డీఓలో ఉద్యోగం చేసే సైంటిస్టులకు భారీగానే జీతభత్యాలు ఉంటాయి. ఇవి సదరు హోదాలపై ఆధారపడి ఉంటాయి. అయితే సాధారణంగా ఒక్కో శాస్త్రవేత్తకు రూ.లక్షపైనే వేతనం చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ..
DRDO Scientist B Selection Process : పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు గేట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అర్హులైన అభ్యర్థులు సాధించిన గేట్ స్కోరు ఆధారంగా 1:10 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. కాగా, ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ఇందుకోసం అఫిషియల్ వెబ్‌సైట్‌ను చూడండి.
ఎంత వెయిటేజీ?
- గేట్‌లో స్కోరుకు 80శాతం వెయిటేజీ
- పర్సనల్ ఇంటర్వ్యూకు 20శాతం వెయిటేజీ
జాబ్ లొకేషన్..
DRDO Scientist B Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్..
DRDO Scientist B Website : వయోపరిమితి సడలింపులు, సిలబస్ వంటి సమగ్ర సమాచారం కోసం సంస్థ అధికారిక వెబ్సైట్ www.drdo.gov.in ను చూడొచ్చు.
Western Coalfields Ltd Recruitment 2023 : ఇటీవలే 1191 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబరు 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నియమకాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Engineering Jobs 2023 : ఐటీఐ, ఇంజినీరింగ్ అర్హతతో.. 531 నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు!
Engineering Jobs 2023 : ఐటీఐ, డిప్లొమా అర్హతతో.. 1191 అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!