ETV Bharat / bharat

రూ.60 లక్షల వాచ్​ ధ్వంసం.. కస్టమ్స్​ అధికారులపై కేసు - ఖరీదైన గడియారం విచ్ఛిన్నం

బంగారం స్మగ్లింగ్​ చేస్తున్నాడనే అనుమానంతో ఓ ప్రయాణికుడి పట్ల కస్టమ్స్​ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి అతని విలువైన చేతి గడియారాన్ని పగలగొట్టారు. దాని విలువ సూమారు రూ.60 లక్షలు ఉంటుందని తెలుసుకొని షాక్​కు గురయ్యారు. కస్టమ్స్​ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ సంఘటన కేరళ కాలికట్​ విమానాశ్రయంలో జరిగింది.

Doubt of a man kept gold in the watch, Customs officials broke that:lodged complaint against officials
విమానాశ్రయంలో తనిఖీలు.. రూ.60 లక్షల గడియారం విచ్ఛిన్నం
author img

By

Published : Mar 8, 2021, 3:30 PM IST

బంగారం అక్రమ రవాణా చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి పట్ల కస్టమ్స్​ అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహమే వారిపై కేసు నమోదయ్యేలా చేసింది. చేతి గడియారంలో బంగారం ఉందనే అనుమానంతో దానిని విచ్ఛిన్నం చేసి.. విడిబాగాలను అతని చేతిలో పెట్టారు. చివరకు దాని విలువ తెలుసుకొని అవాక్కయ్యారు.

ఇదీ జరిగింది..

కర్ణాటకలోని భట్కల్​కు చెందిన మొహమ్మద్​ ఇస్మాయిల్​ అనే వ్యక్తి దుబాయ్​లోని తన సోదరుడిని కలిసేందుకు వెళ్లాడు. సొంతూరుకు తిరిగివచ్చే క్రమంలో మార్చి 3న కేరళలోని కాలికట్​ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్​పై తనిఖీలు చేస్తున్న అక్కడి కస్టమ్స్​ అంధికారులు.. ఇస్మాయిల్​ను అదుపులోకి తీసుకున్నారు. అతని చేతికి ఉన్న గడియారంలో బంగారం ఉందనే నెపంతో దానిని తీసుకొని పగలగొట్టారు. అందులో ఎలాంటి పసిడి పదార్థం లేదని తెలుసుకుని.. మళ్లీ బిగించకుండానే తిరిగి ఇచ్చారు.

తన గడియారం ఎప్పటిలా చేసి ఇవ్వాలని ఇస్మాయిల్​ కోరాడు. గడియారం ధర సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని తెలపగా అవాక్కయ్యారు అధికారులు. తన విలువైన వాచ్​ని అధికారులు విరగొట్టారని కాలికట్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు ఇస్మాయిల్​.

ఆ గడియారాన్ని ఇస్మాయిల్​ సోదరుడు 2017లో రూ.48 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. 3-4 ఏళ్లు తాను వినియోగించి.. ఇస్మాయిల్​కు ఇటీవలే బహుమతిగా ఇచ్చాడు.

ఇదీ చదవండి: కర్ణాటకలో 25కిలోల జిలెటిన్ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.