ETV Bharat / bharat

భార్యను టీజ్​ చేశారని ఇద్దరు ఫ్రెండ్స్​ను చంపిన భర్త - ఇద్దరు స్నేహితులను చంపి

Wife Tease Murder In Mysore: తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కోపంతో ఇద్దరు స్నేహితులను చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Double murder in Mysore
మైసుర్​లో మర్డర్
author img

By

Published : Dec 12, 2021, 3:52 PM IST

Wife Tease Murder In Mysore: తన భార్యను పదేపదే ఆటపట్టిస్తున్నారన్న కోపంతో.. స్నేహితులను హత్యచేశాడు ఓ వ్యక్తి. కర్ణాటక మైసూర్​ జిల్లా హెచ్​డీ కోటే మండలంలోని బోగడి రోడ్​ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. మృతులను రవి, బసవగా గుర్తించారు పోలీసులు.

ఇదే జరిగింది..

హెచ్​డీ కోటే మండలంలోని కొత్తెగల గ్రామానికి చెందిన రవి, బసవ, మహేశ్​ స్నేహితులు. అయితే మహేశ్​ భార్యపై రవి తరచుగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుండేవాడు. రవికి.. బసవ సహకరించేవాడు.

డిసెంబర్​ 11న రాత్రి.. రవి, బసవ, మహేశ్, మరో స్నేహితుడు కలిసి బోగడి రోడ్డు వద్ద మందు పార్టీ చేసుకున్నారు. ఈ సమయంలో మహేశ్​ భార్యను టీచ్ చేసే వ్యవహారం చర్చకు వచ్చింది. దీంతో వారి మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మహేశ్​.. పదునైన ఆయుధంతో రవి, బసవను పొడిచి చంపాడు.

ఈ ఘటనపై సరస్వతిపురం స్టేషన్​లో కేసు నమోదైంది. నిందితుడు మహేశ్​, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇదీ చూడండి: బంగారు గొలుసును ​మింగేసిన గోవు.. చివరకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.