ETV Bharat / bharat

'రంగు గురించి భయపడొద్దు.. కారణం తెలుసుకోండి' - మ్యూకోర్​మైకోసిస్ కేసులపై నిపుణులు

మ్యూకోర్​మైకోసిస్(ఫంగస్​) కేసులపై ప్రజలు ఆందోళన చెందవద్దని నిపుణులు తెలిపారు. రంగుల గురించి ఆందోళన పడకుండా.. వ్యాధి సోకడానికి గల కారణాలు, ముప్పును తెలుసుకుంటే మెరుగైన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

mucormycosis in india, మ్యూకోర్​మైకోసిస్ కేసులపై నిపుణులు
మ్యూకోర్​మైకోసిస్​పై నిపుణుల సూచనలు
author img

By

Published : May 25, 2021, 5:21 PM IST

బ్లాక్​, ఎల్లో​, వైట్​ ఫంగస్​ పేరుతో మ్యూకోర్​మైకోసిస్ కేసుల నమోదు పెరుగుతున్న నేపథ్యంలో ఈ శిలీంధ్ర వ్యాధి వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు అంటువ్యాధుల నిపుణులు. ఫంగస్​ రంగుల గురించి ఆందోళన చెందవద్దని.. అది ఏ రకమైన ఇన్ఫెక్షనో, అందుకు గల కారణాలు, ఎదురయ్యే ముప్పును తెలుసుకోవడం ద్వారా సమస్యకు మెరుగైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఫంగస్​లోని రకాలను బ్లాక్​, వైట్​, ఎల్లో అంటూ పేర్కొనడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని ఐసీఎంఆర్​కు చెందిన అంటువ్యాధుల విభాగ అధిపతి డాక్టర్​ సమీరన్ పండా అన్నారు.

వాటిపై పరిశోధన అవసరం..

ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో నమోదైన ఎల్లో ఫంగస్​ కేసుపై డాక్టర్​ సమీరన్ స్పందించారు. ఎల్లో ఫంగస్​ బల్లులు వంటి రెప్​టైల్స్​లో ఎక్కువగా గుర్తిస్తామని.. అయితే ప్రస్తుతం మనుషుల్లో నమోదవుతున్న ఈ ఫంగస్​ అదే రకానికి చెందినదా కాదా అనే విషయంపై పరిశోధన చేయాల్సి ఉందన్నారు.

'అసలు కారణం ఏంటి?'

మ్యూకోర్​మైకోసిస్ వ్యాప్తికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ పబ్లిక్​ హెల్త్​కు చెందిన ప్రొఫెసర్​ డాక్టర్​ గిరిధర బాబు అన్నారు.

"వైరల్​, ఫంగల్​ ఇన్​ఫెక్షన్స్​ ఎప్పుడూ ఉండేవే. కానీ రోగ నిరోధక శక్తి కారణంగా ఎవరిపైనా పెద్దగా ప్రభావం చూపేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది. మొదటి దశలో కూడా లేని ఈ పరిస్థితి ఇప్పుడు రావడం వెనుక కారణాలు ఏంటో తెలుసుకోవాలి. లేదంటే మెరుగైన పరిష్కారం లభించదు."

-ప్రొఫెసర్​ డాక్టర్​ గిరిధర బాబు, ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ పబ్లిక్​ హెల్త్

ఇదీ చదవండి : 'ఫంగస్​లలో భిన్నమైన రంగులు అందుకే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.