దేశంలోని పౌరులందరికీ కరోనా టీకాను ఉచితంగా అందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశాన్ని భాజపా వ్యవస్థకు బాధితురాలిగా మార్చొద్దని మండిపడ్డారు.
"వ్యాక్సిన్‌పై చర్చించింది చాలు. దేశ పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలి. భాజపా వ్యవస్థకు దేశం బాధితురాలిగా మిగిలిపోవడానికి వీల్లేదు."
-రాహుల్ గాంధీ ట్వీట్
దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు ఉచితంగా పంపిణీ చేయాలని రాహుల్ గాంధీతో పాటు.. కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ టీకా విధానం, దేశంలో కరోనా వైరస్ కట్టడిపైనా పార్టీ విమర్శలు చేస్తోంది.
ఇక వ్యాక్సిన్ సరఫరా చేయకుండా తయారీదారుల వద్ద నుంచి నిల్వలను కేంద్రం "హైజాక్" చేస్తోందని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేగాక మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ సాధ్యమేనా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఇవీ చదవండి: