గత ఎన్నికల్లో తప్పులు చేసిన అధికారులకు రానున్న ఎలక్షన్లలో మళ్లీ విధులు అప్పగించకూడదని ఎన్నికల సంఘం(ఈసీ) సూచించింది. ఆ మేరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోం, కేరళ, బంగాల్, పుదుచ్చేరిల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.
క్రమశిక్షణ చర్యలకు గురైన వారికి, విచారణ పెండింగ్లో ఉన్న వారికి, జరిమాన పడ్డ వారికి కూడా విధులు ఇవ్వకూడదని తెలిపింది. ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న వారికీ ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించకూడదని పేర్కొంది.