ETV Bharat / bharat

కుక్క పిల్లకు బారసాల.. లాలిపాటలు పాడుతూ వేడుక.. పేరేం పెట్టారంటే? - కుక్కపిల్లకు బారసాల చేసిన గ్రామస్థులు

ఓ ఊరిలోని వారంతా కలిసి కుక్క పిల్లకు బారసాల నిర్వహించారు. కుక్కకు పేరు పెట్టి.. వేడుకను ఘనంగా నిర్వహించింది. వివరాల్లోకి వెళ్తే..

Dogs Puppy naming ceremony
Dogs Puppy naming ceremony
author img

By

Published : Nov 20, 2022, 12:58 PM IST

Updated : Nov 20, 2022, 2:58 PM IST

కుక్క పిల్లను ఊయలలో వేసి బారసాల చేసిన గ్రామస్థులు

సాధారణంగా పిల్లలు పుట్టిన మూడు నెలలకు వారికి బారసాల చేసి శాస్త్రోక్తంగా నామకరణం చేస్తారు. తమకు చిరకాలం గుర్తుండిపోయే ఆ వేడుకను ఉన్నంతలోనే ఘనంగా నిర్వహించాలనుకుంటారు. ఇది సహజమే. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామస్థులు.. తమ కుక్కపిల్లకు బారసాల నిర్వహించారు. డీజే మ్యూజిక్, మహిళల లాలి పాటల మధ్య జరిగిన ఈ వేడుక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

వివరాల్లోకి వెళ్తే...
కిన్హి చంద్రపుర్ జిల్లాలోని బ్రహ్మపురి తాలూకాలో ఓ ఆడకుక్కను ఆ గ్రామస్థులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇటీవలే ఆ కుక్క పది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఓ కుక్కపిల్లకు నామకరణం చేద్దామని నిర్ణయించుకున్న గ్రామస్థులు స్థానిక హనుమాన్​ మందిరంలో ఓ పెద్ద వేడుకను నిర్వహించారు. అంతే కాకుండా మహిళలంతా ఒక్కచోట చేరి ఆ కుక్క పిల్లను ఊయలలో వేసి ఊపారు. లాలి పాటలు పాడుతూ కుక్కపిల్లలను బుజ్జగించారు. ఆ శునకానికి దత్తాత్రేయ అని నామకరణం చేశారు. అదే గ్రామానికి చెందిన అనుసాయా యాదయ్​ అనే ఓ మహిళ ఆ కుక్క పిల్లల బాధ్యత తీసుకున్నారు.

Last Updated : Nov 20, 2022, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.