ETV Bharat / bharat

పెంపుడు కుక్కను హత్య చేసిన ఆకతాయిలు.. ఆ పనికి అడ్డువస్తున్నందుకే! - పెంపుడు కుక్కను చంపిన యువకులు

ఉత్తర్​ప్రదేశ్​లోని కొందరు ఆకతాయిలు ఓ పెంపుడు కుక్కకు విషం కలిపిన మాంసం ముక్కలు పెట్టి హత్య చేశారు. అమ్మాయిలను వేధిస్తున్న ఆ యువకులు తమ ఇంటి సమీపానికి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తున్నందుకే చంపేశారని యజమాని ఆరోపిస్తున్నారు.

Dog killed in Parsa Khurd village
Dog killed in Parsa Khurd village
author img

By

Published : Dec 2, 2022, 6:56 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో కొందరు ఆకతాయిలు ఓ పెంపుడు కుక్కను హత్య చేశారు. యజమాని ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. మాంసం ముక్కల్లో విషం కలిపి ఈ దారుణానికి పాల్పడ్డారు. అమ్మాయిలను వేధిస్తున్న ఆ యువకులు తమ ఇంటి సమీపానికి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తున్నందుకే చంపేశారని యజమాని ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బస్తీ జిల్లాలోని పార్సకుర్ద్​ ప్రాంతానికి చెందిన రాజన్​ చౌదరి మూడు కుక్కలను పెంచుతున్నారు. అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నారు. వారంతా రాజన్​ ఇంటి సమీపానికి వచ్చినప్పుడు.. రెండు జర్మన్ షెపర్డ్ జాతి కుక్కలతో మరో కుక్క మొరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది.

Dog killed in Parsa Khurd village
పెంపుడు కుక్కతో రాజన్​ చౌదరి

దీంతో ఆ ఆకతాయిలు రాజన్​ కుక్కలపై పగ పెంచుకున్నారు. ఎలా అయిన వాటిని చంపేందుకు పథకం రచించారు. నవంబర్​ 29న రాజన్​ కుటుంబం ఇంట్లో లేని సమయంలో మాంసం ముక్కల్లో విషం కలిపి కుక్కలకు పెట్టారు. అవి తిన్న మాక్స్​ అనే కుక్క చనిపోయింది. ఈ విషయంపై రాజన్​ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని ఎస్పీని రాజన్​ కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.