ETV Bharat / bharat

శునకం కోసం విమానం బిజినెస్​ కేబిన్​ బుకింగ్​ - కుక్క కోసం ఖర్చు

తన పెంపుడు శునకాన్ని ఎయిర్ ఇండియా విమానంలో(Air India Flight) తీసుకువెళ్లేందుకు ఓ వ్యక్తి భారీగా ఖర్చు చేశాడు. బిజినెస్​ కేబిన్​ మొత్తాన్ని అతడు బుక్ చేసుకుని.. విమానంలో ప్రయాణించాడు. అసలింతకీ ఆ వ్యక్తి ఎంత ఖర్చు చేశాడు? ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాడంటే..?

dog in air india flight
విమానంలో శునకం ప్రయాణం
author img

By

Published : Sep 19, 2021, 7:05 AM IST

పెంపుడు శునకంపై ప్రేమతో ఓ వ్యక్తి.. పెద్ద మొత్తాన్నే ఖర్చు చేశాడు. ముంబయి నుంచి చెన్నై ప్రయాణం కోసం ఎయిర్ ఇండియా విమానంలో(Air India Flight) బిజినెస్​ కేబిన్ ​ మొత్తాన్ని బుక్ చేశాడు. ఇందుకోసం ఆయన రూ.2.5లక్షలకుపైగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

మాల్టీస్​ స్మాల్టిజ్​ ఫార్బెల్​ జాతికి చెందిన ఈ కుక్కతో సహా.. సదరు వ్యక్తి ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) ఎల్​-671 బిజినెస్​ క్లాసులో వెళ్లాడు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయం నుంచి చెన్నైకు బుధవారం ఉదయం 9 గంటలకు ఈ విమానం బయల్దేరింది. ఈ విమానంలోని బిజినెస్ క్లాసులో ఒక్క సీటు టికెట్ ధర దాదాపు రూ.20,000గా ఉంటుంది. అయితే.. మొత్తం 12 సీట్లను బుక్ చేసుకున్న ఆ వ్యక్తి.. తన శునకంతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.

dog in air india flight
ముంబయి నుంచి చెన్నైకి ఎయిర్​ ఇండియా బిజినెస్​ కేబిన్​లో ప్రయాణించిన శునకం

ఎయిర్ ఇండియా విమానం విధానాల ప్రకారం... పిల్లులు, శునకాలు, పక్షులు వంటివి విమానంలో యజమానులతో పాటు ప్రయాణించవచ్చు. అయితే.. వాటికి టీకాలు వేసినట్లుగా ధ్రువపత్రం ఉండాల్సిందే. జంతువు శరీర పరిమాణాన్ని బట్టి ఒక్కో ప్రయాణికుడు రెండు జంతువుల వరకు తమతో పాటు తీసుకువెళ్లవచ్చు. కేబిన్​లో లేదా కార్గోలో అవి ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. బిజినెస్​ క్లాసులో అయితే.. పెంపుడు జంతువులకు చివరి వరుసలోని సీట్లలో కూర్చోబెడతారు.

ఇదీ చూడండి: వీధి శునకాలంటే మహా ప్రేమ- 15 ఏళ్లుగా రోజూ మాంసాహారం!

ఇదీ చూడండి: అక్కడి వీధి శునకాలకు అన్నపూర్ణ ఆమె!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.