ETV Bharat / bharat

తోటి శునకానికి రక్తదానం- రాకీ ప్రాణాలు కాపాడిన సిరి! ఎక్కడో తెలుసా? - అక్కి ఆలూర్​లో రక్తదానం చేసిన శునకం

Dog Blood Donation In Karnataka : మనుషుల మాదిరిగానే కుక్కలు కూడా రక్తదానం చేస్తూ వాటి పెద్ద మనసును చాటుకుంటున్నాయి. అనారోగ్యానికి గురైన తోటి శునకానికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడింది మరో శునకం. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.

Dog Blood Donation In Karnataka
Dog Blood Donation In Karnataka
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 7:51 AM IST

Updated : Dec 11, 2023, 7:57 PM IST

తోటి శునకానికి రక్తదానం- రాకీ ప్రాణాలు కాపాడిన సిరి! ఎక్కడో తెలుసా?

Dog Blood Donation In Karnataka : ఓ శునకం మరో శునకానికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడింది. లెప్టోస్పెరోసిస్​ అనే వ్యాధితో బాధపడుతున్న ఓ శునకానికి శస్త్రచికిత్స సమయంలో సహాయం చేసింది మరో శునకం. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటక హవేరి జిల్లాలోని అక్కి ఆలూరు​ గ్రామంలో జరిగింది. ఇదే గ్రామంలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి కావడం విశేషం.

హనగల్​ జిల్లాలోని హుల్లత్తి గ్రామానికి చెందిన రాకీ(శునకం) లెప్టోస్పెరోసిస్​ అనే వ్యాధితో బాధపడుతోంది. దీంతో శునకం యజమాని.. రాకీని అక్కి ఆలూరులోని వెటర్నిటీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రాకీకి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని, అందుకు రక్తం అవసరం అని డాక్టర్​ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న హనగల్ తాలూకాలోని బొమ్మనహళ్లికి చెందిన రంజిత్.. తన పెంపుడు కుక్క సిరితో రక్తదానం చేయించాలనుకున్నాడు. సిరిని ఆస్పత్రికి తీసుకెళ్లి రక్తదానం చేయించి రాకీ ప్రాణాలను కాపాడారు.

ఇప్పటికే అక్కి ఆలూరు గ్రామం రక్తదానానికి ప్రసిద్ధి చెందింది. బ్లడ్ ఆర్మీ ఆర్గనైజేషన్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు అక్కి ఆలూరుకు చెందిన కానిస్టేబుల్ కరబసప్ప గొండి. ఈ సంస్థ నేత్రదానం, రక్తదానం, చర్మదానంపై అవగాహన కల్పిస్తోంది. బ్లడ్ ఆర్మీ చీఫ్ కరబసప్ప ఇప్పటి వరకు 100 సార్లు రక్తదానం చేశారు. దీంతో హవేరి జిల్లాలో తొలి సెంచరీ రక్తదాతగా కరబసప్ప గొండి నిలిచారు. బ్లడ్​ ఆర్మీ ఇప్పుడు ఈ శునకానికి కూడా రక్తాన్ని సేకరించి ప్రత్యేకతను చాటుకుంది. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక రక్త దాతను మనం చూడవచ్చు.

Dog Blood Donation In Karnataka
రాకీ, సిరితో యజమానులు, వైద్యులు

గర్భిణీ శునకానికి రక్తదానం.. పెద్ద మనసు చాటుకున్న జిమ్మీ
ఇదే ఆస్పత్రిలో మార్చి నెలలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. జిప్సీ అనే రెండు నెలల గర్భిణీ శునకానికి రక్తదానం చేసింది జిమ్మీ శునకం. రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణీ శునకానికి ఈ మేరకు సాయం చేసింది. ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

అడవిలో ప్రాణాపాయంలో యజమాని.. కాపాడిన శునకం.. ఎలాగంటే..

పొదల్లో దాక్కున్న నిందితుడిని పట్టించిన పోలీస్ డాగ్​ 'రక్ష'.. మర్డర్ జరిగిన 24 గంటల్లోనే..

Last Updated : Dec 11, 2023, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.