ETV Bharat / bharat

Doctors Saves Life Of Child: ఫ్లైట్​ టేకాఫ్​ అయ్యాక చిన్నారి పరిస్థితి విషమం.. గాల్లోనే ప్రాణం పోసిన ఎయిమ్స్​ వైద్యులు

Doctors Saves Life Of Child On Plane : విమానం టేకాఫ్​ అయిన కాసేపటికే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది ఓ రెండేళ్ల చిన్నారి. అదే విమానంలో ప్రయాణిస్తున్న దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు.. హుటాహుటిన స్పందించి ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడారు. అసలేం జరిగిందంటే?

Doctors Saves Life Of Toddler On Plane
Doctors Saves Life Of Toddler On Plane
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 2:33 PM IST

Doctors Saves Life Of Child On Plane : విమాన ప్రయాణంలో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయన ఓ రెండేళ్ల చిన్నారిని.. దిల్లీ ఎయిమ్స్​ వైద్యుల బృందం కాపాడింది. 45 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి చిన్నారి ప్రాణాలను రక్షించింది. బెంగళూరు నుంచి దిల్లీకి బయలుదేరిన విస్తారా సంస్థకు చెందిన యూకే 814 విమానంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?
గుండె సంబంధిత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం బెంగళూరు నుంచి దిల్లీకి తీసుకెళుతున్నారు. అయితే ఆ విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఒక్కసారిగా చిన్నారి.. ఊపిరి తీసుకోవడం ఆపేసింది. అంతేకాకుండా పెదాలు, వేళ్లు కూడా నీలిరంగులోకి మారాయి. నాడి కొట్టుకోవడం నిలిచిపోయింది. వెంటనే అధికారులు.. విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పుర్​కు మళ్లించారు.

ఏం చేయాలో తెలియక చిన్నారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ (ISVIR) సదస్సుకు వెళ్లి అదే విమానంలో తిరిగి వస్తున్న దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన వైద్య బృందం చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. వెంటనే చిన్నారిని తాము కాపాడుతామని ముందుకు వచ్చింది. హుటాహుటిన అత్యవసర చికిత్స ప్రారంభించింది.

చిన్నారి ఊపిరి తీసుకొనేందుకు వీలుగా శ్వాస నాళాల్లో ఏర్పాట్లు చేశారు వైద్యులు. సీపీఆర్‌ చేయడం వల్ల తిరిగి చిన్నారి ఊపిరి పీల్చుకుంది. 45 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించిన వైద్యులు.. ప్రథమ చికిత్స ద్వారా ప్రాణాలను రక్షించారు. విమానం ల్యాండ్​ అయిన అనంతరం నాగ్​పుర్​లో ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుడికి అప్పగించారు.

Doctors Saves Life Of Toddler On Plane
చిన్నారి కాపాడిన దిల్లీ ఎయిమ్స్​ వైద్యుల బృందం

Delhi Aiims Doctors Saves Child : విమానంలో జరిగిన ఘటనతో పాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి దిల్లీ ఎయిమ్స్‌ తన ఎక్స్​( ట్విట్టర్​) అధికారిక ఖాతాలో షేర్‌ చేసింది. బాలిక ప్రాణాలను కాపాడిన వైద్యులు.. డా.నవ్​దీప్​ కౌర్​, డా.దమన్​దీప్​ సింగ్​, డా.రిషబ్​ జైన్​, డా.ఔయిశిక, డా.అవిచల తాక్సక్​లకు ఆ విమాన ప్రయాణికులతో పాటు అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • #Always available #AIIMSParivar
    While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced

    It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM

    — AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అవిభక్త కవలలకు 'కొత్త'జీవితం.. దిల్లీ వైద్యుల ఆపరేషన్​ సక్సెస్​.. ఆస్పత్రిలోనే ఫస్ట్ బర్త్​డే..

ఇజ్రాయెల్‌ వైద్యుల అద్భుతం.. తెగిన తలను అతికించి బాలుడికి పునర్జన్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.