ETV Bharat / bharat

రోగికి 'రాంగ్'​ ఆపరేషన్! వైద్యుడి నిర్లక్ష్యంతో యువకుడు మృతి- రూ.1.27 కోట్ల ఫైన్​ - లఖ్​నవూ పేషెంట్​ రాంగ్ ఆపరేషన్

Doctor Wrong Operation In Lucknow Uttar Pradesh : తప్పుడు ఆపరేషన్ చేసి ఓ యువకుడి మరణానికి కారణమయ్యాడు ఓ డాక్టర్. దీంతో వినియోగదారుల కమిషన్ రూ.1.27 కోట్ల జరిమానా విధించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాలు.

Doctor Wrong Operation In Lucknow Uttar Pradesh

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 12:39 PM IST

Doctor Wrong Operation In Lucknow Uttar Pradesh : వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గాల్​ బ్లాడర్​ (పిత్తాశయం) సమస్యతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్​కు ఓ వైద్యుడు ఆపరేషన్ చేశాడు. ఆ తర్వాత యువకుడు మృతి చెందాడు. దీంతో వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించిన బాధితుడి తండ్రి, వైద్యుడు సరిగ్గా ఆపరేషన్​ చేయకపోవడం వల్లే తన కుమారుడు చనిపోయాడని ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన కమిషన్ నిందితులకి రూ.1.27 కోట్లు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 30 రోజ్లుల్లోగా చెల్లించాలని డెడ్​లైన్​ విధించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగింది.

ఇదీ జరిగింది
ఫతేపుర్​కు చెందిన జ్ఞాన్​దేవ్​ శుక్లా కుమారుడు శివమ్​ శుక్లా 2015 కడుపు నొప్పితో లఖ్​నవూలోని లోహియా ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే డాక్టర్ అరుణ్​ కుమార్​, శివమ్​కు పలు పరీక్షలు చేశాడు. రిపోర్టుల్లో శివమ్​ పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు బయటపడింది. ఆ తర్వాత ఆపరేషన్ (Gall Bladder Stone Removal Surgery)​ చేయాలని డాక్టర్ అరుణ్ సూచించాడు. అయితే లోహియా ఆస్పత్రిలో టెలిస్కోపిక్​ సౌకర్యం ఉన్నప్పటికీ ఓ ప్రైవేటు నర్సింగ్​ హోమ్​కు రోగిని తరలించాలని సిఫారసు చేశాడు అరుణ్​. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులు డాక్టర్ చెప్పిన హైకోర్టు సమీపంలోని నర్సింగ్​ హోమ్​కు తరలించారు. అక్కడ శివమ్​కు దాదాపు రూ.40 వేల వరకు వసూలు చేసి తప్పుడు ఆపరేషన్​ చేశాడు డాక్టర్ అరుణ్.

అయితే ఆపరేషన్​ తర్వాత శివమ్​ ఆరోగ్యం క్షీణించింది. దీంతో డాక్టర్​ అరుణ్​ బాధితుడిని మళ్లీ లోహియా ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ శివమ్​ మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితుడి తండ్రి జ్ఞాన్​దేవ్​ శుక్లా రాష్ట్ర వినియోగదారుల కమిషన్​లో ఫిర్యాదు చేశాడు. తన కుమారుడికి డాక్టర్​ అరుణ్​ 'రాంగ్​' ఆపరేషన్​ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసులో విచారణ జరిపిన కమిషన్ బాధితులకు డాక్టర్ అరుణ్​ రూ.25 లక్షలు, ప్రైవేటు నర్సింగ్​ హోమ్ ఆపరేటర్ రూ.50 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ జరిమానాపై 2015 జులై 20 నుంచి 12 శాతం వార్షిక వడ్డీ కలిపి 30 రోజుల్లో చెల్లించాలని డెడ్​లైన్​ విధించింది. లిటిగేషన్​ ఛార్జీలు తదితరాలు కలిపి మొత్తంగా రూ.1.27 కోట్లను చెల్లించాలని ఆజ్ఞాపించింది.

Gall Bladder Stone Surgery : వృద్ధుడి పిత్తాశయంలో 1,364 రాళ్లు.. 45 గంటల పాటు శ్రమించిన వైద్యులు.. చివరకు..

టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్​! మత్తుమందుతో పేషెంట్లు​ అలానే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.