తమిళనాడులోని డీఎంకే ఎమ్మెల్యే ఆలడి అరుణ ఆత్మహత్యాయత్నం చేశారంటూ వచ్చిన వదంతులకు ఆమె చెక్ పెట్టారు. శరీరంలో చక్కెర స్థాయి తగ్గటమే ఆసుపత్రిలో చేరడానికి కారణమని తెలిపారు. వైద్యుల సలహామేరకు సీటీ స్కాన్ తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు.
నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వదంతులను ప్రచురించడాన్ని తప్పుబట్టారు అరుణ.
ఇదీ జరిగింది..
తిరునెల్వేలిలోని ఓ ఆసుపత్రిలో అరుణ గురువారం చేరగా... ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో అంతర్గత కలహాల వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్న వార్తలు ప్రకంపనలు సృష్టించాయి. తొలుత ఈ వార్తలను డీఎంకే పార్టీ నేతలు ఖండించారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే 'ఆత్మహత్యాయత్నం'పై దుమారం