మరో 5 నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే అధినేత స్టాలిన్.. తన సోదరుడు అళగిరిని పార్టీ నుంచి తొలగించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఆసక్తిగా ఉన్న అళగిరి.. ఆయన స్థాపించే పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తలైవాతో భేటీ కానున్నట్లు తెలిపారు. డీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన నేపథ్యంలో జనవరి 3న తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు అళగిరి తెలిపారు.
గతంలోనూ..
డీఎంకే పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో మధురై ఒకటికాగా.. ఇక్కడ అళగిరి ప్రాబల్యం ఎక్కువ. పార్టీ వ్యతిరేక కార్యకలాపాకు పాల్పడుతున్నారనే కారణంతో 2014లో అప్పటి డీఎంకే అధినేత కరుణానిధి.. అళగిరిని పార్టీ నుంచి తొలగించారు.
ఇదీ చదవండి: 'మోదీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారు'